Bhagavanth Kesari : హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న భగవత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్
ఈ సినిమాను డిమాండ్‌కు తగినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో 1110 స్క్రీన్లలో , ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్ ప్రపంచ వ్యాప్తంగా మొదలవ్వగా..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తుంది.
- By Sudheer Published Date - 03:27 PM, Tue - 17 October 23

అఖండ , వీర సింహరెడ్డి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ (Balakrishna) ..ఇప్పుడు భగవత్ కేసరి తో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దసరా కానుకగా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో శ్రీ లీల (Sreeleela) ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ , సాంగ్స్ సినిమా ఫై ఆసక్తి పెంచాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ (Bhagavanth Kesari advance booking) తాజాగా ఓపెన్ కాగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రాన్ని సుమారుగా 90 కోట్ల రూపాయలతో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం. ఈ సినిమాను డిమాండ్‌కు తగినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో 1110 స్క్రీన్లలో , ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్ ప్రపంచ వ్యాప్తంగా మొదలవ్వగా..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ తోనే రూ.2 కోట్లు వచ్చాయంటే ఫస్ట్ డే కలెక్షన్లు పలు రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు అభిమానులు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఇక బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14.25 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు సాధించింది. ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను భగవంత్ కేసరి అధిగమిస్తుందా? అనేది చూడాలి.
Read Also : BRS to Congress: రేవంత్ ఇంటి వైపు గులాబీ చూపులు