Bangalore Rave Party : నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు..
ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు
- By Sudheer Published Date - 03:18 PM, Sat - 25 May 24

తెలుగు రాష్ట్రాల్లో బెంగుళూర్ రేవ్ పార్టీ (Bangalore Rave Party) అనేది సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీ లో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఉండడంతో అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రేవ్ పార్టీ పై పోలీసులు సైతం సీరియస్ గా తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నటి హేమ(Hema)కు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్తం నమూనాలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెని విచారించాలని నిర్ణయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హేమను విచారణకు రావాలని పిలిచారు. అసలు బెంగళూరు రేవ్ పార్టీతో తనకి సంబంధం లేదని బుకాయించిన హేమ ఇక ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
మరో వైపు రేవ్ పార్టీ కేసులో జీఆర్ ఫామ్ హౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డికి కూడా బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కేసులో A2అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పోలీసులు.. రణధీర్ బాబు డెంటిస్ట్ గా చేస్తున్నట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది.
Read Also : New Academic Calendar : అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. దసరా, సంక్రాంతి సెలవుల వివరాలివీ