Bellamkonda Bhairavam : భైరవం టైటిల్ తో బెల్లంకొండ సినిమా.. రీమేక్ కథ కలిసి వస్తుందా..?
Bellamkonda Bhairavam ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని అర్ధమవుతుంది.
- By Ramesh Published Date - 11:25 PM, Mon - 4 November 24

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) లీడ్ రోల్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా భైరవం అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని అర్ధమవుతుంది. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.
సో యువ హీరోల మల్టీస్టారర్ సినిమాగా భైరవం వస్తుంది. ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ గరుడన్ కి రీమేక్ గా వస్తుందని టాక్. అక్కడ కమెడియన్ సూరీ లీడ్ రోల్ లో నటించగా అదే పాత్రను బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నాడు. సో సూపర్ హిట్ కథతో వస్తున్నారు కాబట్టి కచ్చితంగా తెలుగులో కూడా సినిమా సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంది.
మంచు మనోజ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్..
మంచు మనోజ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. బెల్లంకొండ తో భైరవం (Bhairavam)తో పాటుగా తేజా సజ్జా మిరాయ్ లో కూడా మంచు మనోజ్ (Manchu Manoj) నటిస్తున్నాడు. ఆ సినిమాలో అతను విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మంచి హీరో కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి పడినట్టే అనిపిస్తుంది. మిరాయ్ సంగతేమో కానీ భైరవం ఆల్రెడీ హిట్ కథ కాబట్టి తెలుగులో కూడా మంచి ఫలితాన్ని అందుకునే ఛాన్స్ ఉంది.
Also Read : Pushpa 2 : పుష్ప 2 ప్రమోషన్స్ కోసం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!