Balayya In Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అంతకు ముందు నుంచే నటసింహం బాలయ్య తో మంచి పరిచయం ఉంధీ దర్శకుడికి, గతంలో బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్ కి సంబంధించి ప్రోమో ని బాల్లయ్య తో గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కించారు ఈ యువ దర్శకుడు.
- Author : manojveeranki
Date : 05-09-2024 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
హనుమాన్ (HanuMan) సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma). అంతకు ముందు నుంచే నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) తో మంచి పరిచయం ఉంధీ దర్శకుడికి, గతంలో బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్ (Unstoppable) కి సంబంధించి ప్రోమో ని బాల్లయ్య తో గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కించారు ఈ యువ దర్శకుడు. హనుమాన్ తర్వాత నందమూరి వారసుడు, బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ని వెండి తెరకి పరిచయం చేయబోతున్నాడు ప్రశాంత్ అంటూ వార్తలు వచ్చాయి.
అయితే రీసెంట్ గా ఈ దర్శకుడు ఒక కొత్త ఉషస్సు విరజిమ్ముతోంది అని ట్వీట్ చేసి లైన్ కింగ్ సినిమాలోని సింబా ని ఎత్తిపట్టుకునే ఫోటో #SimbaisComing జోడించారు ఆ ట్వీట్ కి…! ఇక మోక్షజ్ఞ అరంగేట్రం సిద్ధం అని నందమమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో. ఈ రోజు 1.33 గంటలకి ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తన X ఖాతాలో పోస్ట్ చేసారు ప్రశాంత్ వర్మ.
ఇది ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎ అని ఫ్యాన్స్ ఇక ఫిక్స్ అయ్యారు. కాగా కొడుకు మొదటి సినిమాలో బాలయ్య కూడా మెరవబోతున్నారు అని టాక్ నడుస్తుంది…. మరియు, ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ PVCU లో భాగంగా ఉండబోతుండి అని తెలుస్తుంది.
https://x.com/PrasanthVarma/status/1831554994136608901