Balakrishna Viswak Sen : బాలకృష్ణ విశ్వక్ సేన్ జస్ట్ మిస్..!
Balakrishna Viswak Sen మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా మార్చి 8న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ తను చేస్తున్న మిగతా సినిమాల విషయాలను
- By Ramesh Published Date - 08:32 AM, Mon - 19 February 24
Balakrishna Viswak Sen మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా మార్చి 8న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ తను చేస్తున్న మిగతా సినిమాల విషయాలను కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో ఒక పెద్ద హీరో సినిమా ఛాన్స్ వదులుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. తన అభిమాన హీరో సినిమాలో ఒక మంచి అవకాశం వచ్చింది కానీ అది చేసే అవకాశం లేదని చెప్పేశానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విశ్వక్ సేన్.
కాస్త అబ్సర్వ్ చేస్తే విశ్వక్ సేన్ కి ఇష్టమైన హీరోల్లో ఎన్.టి.ఆర్, బాలకృష్ణ ఇద్దరు ఉన్నారు. తారక్ దేవరలో విశ్వక్ సేన్ నటించే ఛాన్స్ లేదు ఎటొచ్చి బాలకృష్ణ సినిమాలోనే ఒక యువ హీరో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో బాలయ్య చేస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని అన్నారు.
ఆ పాత్రలో ముందు విశ్వక్ సేన్ ని అడిగి ఉంటారని తెలుస్తుంది. అయితే హీరోగా చేస్తున్న ఈ టైం లో మరో హీరో ఆయన ఎంత అభిమాన నటుడైనా ఒక పాత్రలో నటించడం ఇష్టం లేదని విశ్వక్ సేన్ చెప్పేశాడు. అలా బాలయ్య విశ్వక్ సేన్ జస్ట్ అలా మిస్ అయ్యిందని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ ఈ అవకాశం వదులుకున్నా సరే బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ లతో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు.
Related News
Tollywood : ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ స్టాండ్ ఏమిటి ?
Tollywood : తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై సినీ నటుల ఎఫెక్ట్ చాలా ఎక్కువ.