Gaddar Awards : ఈసారి బాలయ్య మరచిపోయాడు
Gaddar Awards : నందమూరి బాలకృష్ణ మాత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) పేరును మరచిపోయి..కొంతసేపు ఆగి పలికారు
- By Sudheer Published Date - 11:48 AM, Sun - 15 June 25

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పేరును ‘పుష్ప 2 ది రూల్’ ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) మరచిపోవడం… మధ్యలో నీళ్లు తాగి, తర్వాత సీఎం పేరు చెప్పినప్పటికీ అప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. “తెలంగాణ సీఎం పేరు కూడా తెలియదా?” అంటూ చాలామంది సెటైర్లు వేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు అయితే దీనిపై రాజకీయంగా స్పందించారు. సినిమా విడుదల తర్వాత అభిమానులతో కలిసి థియేటర్‌కి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మరణించడంతో పోలీస్ కేసులో చిక్కుకున్నారు. రాత్రంతా స్టేషన్‌లో ఉంచిన నేపథ్యంలో “రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేశారు” అంటూ కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Char Dham Yatra : చార్ ధామ్ యాత్రలో హెలికాప్టర్లపై నిషేధం
ఇక ఇప్పడు నిన్న గద్దర్ అవార్డుల (Gaddar Awards) వేడుకలో అల్లు అర్జున్ మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్తపడ్డాడు. ముఖ్యమంత్రి పేరు , ఉప ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులను ప్రస్తావించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకుంటూ, ఆయనను “రేవంత్ అన్నగారు” అని ప్రస్తావించడం వేడుకకు హైలైట్‌గా మారింది. అయితే అదే వేదికపై నందమూరి బాలకృష్ణ మాత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) పేరును మరచిపోయి..కొంతసేపు ఆగి పలికారు. ఆయన తడబాటును చూసి “బాలయ్య (Balakrishna) డిప్యూటీ సీఎం పేరును మర్చిపోయారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. అప్పుడు అల్లు అర్జున్ మరచిపోతే..ఇప్పుడు బాలకృష్ణ మరచిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.