NBK 109 : బర్త్‌డే రోజు బాలయ్య సర్‌ప్రైజ్.. NBK 109 సినిమా ఓపెనింగ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
బాలకృష్ణ తన అభిమానులకు సడెన్ గా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు బాలకృష్ణ 109వ సినిమా గురించి పలు వార్తలు వినిపించినా ఏవి ఫిక్స్ అవ్వలేదు. కానీ నేడు డైరెక్ట్ సినిమా ఓపెనింగ్ చేశారు.
- By News Desk Published Date - 07:30 PM, Sat - 10 June 23

బాలకృష్ణ(Balakrishna) ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ(Akhanda), వీరసింహరెడ్డి(Veerasimha Reddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అని అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు బాలయ్య. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు చిత్రయూనిట్.
అయితే బాలకృష్ణ తన అభిమానులకు సడెన్ గా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు బాలకృష్ణ 109వ సినిమా గురించి పలు వార్తలు వినిపించినా ఏవి ఫిక్స్ అవ్వలేదు. కానీ నేడు డైరెక్ట్ సినిమా ఓపెనింగ్ చేశారు. బాలయ్య బర్త్‌డే రోజు NBK109 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం చేశారు. ఈ సినిమాను డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఇక పూజా కార్యక్రమం అనంతరం ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇది 1980లలో జరిగే కథ అని తెలుస్తుంది. వియోలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ బాలయ్యని ఎలివేట్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో ప్రపంచానికి ఇతని గురించి తెలుసు కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అని రాశారు. దీంతో ఈ సినిమా పై కూడా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎలాంటి అనౌన్స్ లేకుండా సడెన్ గా సినిమా ఓపెనింగ్ చేసేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతూనే ఫుల్ ఆనందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.
On this special day, Delighted to share the collaboration with the Charismatic 'Natasimham' #NandamuriBalakrishna garu for #NBK109 🦁😍
The auspicious Pooja ceremony took place today, marking the beginning of an incredible cinematic adventure. 🔥
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂… pic.twitter.com/tUeSHH6uDE— Bobby (@dirbobby) June 10, 2023
Also Ready : Samantha: సెర్బియా క్లబ్‌లో సమంత జోరు.. బీరు బాటిల్ పట్టుకొని, ఊ అంటావా పాటకు దుమ్మురేపి!