Balakrishna : వరుసగా మూడు సినిమాలు 100 కోట్లకు పైగా.. సూపర్ హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య..
బాలకృష్ణ హీరోగా శ్రీలీల(Sreeleela) ముఖ్య పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి దసరా కానుకగా ఇటీవల అక్టోబర్ 19న రిలీజయింది.
- Author : News Desk
Date : 25-10-2023 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
బాలకృష్ణBalakrishna) ఇటీవల ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా హిట్స్ కొడుతున్నారు. అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veerasimha Reddy) సినిమాలతో భారీ హిట్స్ కొట్టారు బాలయ్య. ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాయి.అమెరికాలో(America) కూడా ఈ సినిమాలు 1 మిలియన్ డాలర్స్ పైనే కలెక్ట్ చేశాయి. ఇప్పుడు అదే ఫ్లోలో మరో భారీ హిట్ కొట్టారు బాలకృష్ణ.
బాలకృష్ణ హీరోగా శ్రీలీల(Sreeleela) ముఖ్య పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి దసరా కానుకగా ఇటీవల అక్టోబర్ 19న రిలీజయింది. ఈ సినిమా మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని విజయం సాధించింది. భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా మొదటి రోజు 33 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక ఆరు రోజుల్లో ఏకంగా 104 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
దీంతో బాలకృష్ణ వరుసగా మూడో సినిమాతో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి 100 కోట్ల సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన సీనియర్ హీరోగా నిలిచారు. భగవంత్ కేసరి సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కు దూసుకుపోతుంది. బాలయ్య ఇదే ఫామ్ కంటిన్యూ అయితే రాబోయే సినిమాలపై మరిన్ని అంచనాలు పెరుగడం ఖాయం.
Also Read : Shraddha Kapoor : ఏకంగా నాలుగు కోట్లు పెట్టి కార్ కొన్న బాలీవుడ్ భామ..