Balakrishna : థమన్ ని మార్చేస్తున్న బాలయ్య.. ఎందుకని..?
Balakrishna బాలకృష్ణ సినిమా అంటే చాలు థమన్ పూనకాలు వచ్చిన వాడిగా మ్యూజిక్ అందిస్తున్నాడు. అందుకే ఆయన్ను ప్రతి సినిమాకు రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ
- By Ramesh Published Date - 10:43 PM, Tue - 21 January 25

Balakrishna : ఈమధ్య నందమూరి బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబడుతున్నాయి. ముఖ్యంగా పండగకి బాలయ్య సినిమా వస్తుంది అంటే పక్కా హిట్ అనిపించేలా ఉంది. ఐతే బాలయ్య చేస్తున్న సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల సాంగ్స్ మాత్రమే కాదు ఆర్.ఆర్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా థమన్ ని తమ ఫ్యామిలీలో కలిపేసుకునేలా ఓన్ చేసుకున్నారు.
బాలకృష్ణ సినిమా అంటే చాలు థమన్ పూనకాలు వచ్చిన వాడిగా మ్యూజిక్ అందిస్తున్నాడు. అందుకే ఆయన్ను ప్రతి సినిమాకు రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ చేస్తున్న అఖండ 2 కి కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండ 2 మ్యూజిక్ విషయంలో మరోసారి స్పీకర్లు బ్లాస్ట్ అయ్యేలా చేయబోతున్నారని తెలుస్తుంది.
కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..
ఐతే ఆ తర్వాత బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు థమన్ బదులుగా కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని దించుతున్నారని తెలుస్తుంది. తమిళ్ లో అనిరుద్ మ్యూజిక్ సంచలనాల గురించి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ సినిమాలకు అనిరుద్ ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.
బాలకృష్ణ అనిరుద్ కాంబో పడితే ఎలా ఉంటుందో ఫ్యాన్స్ కూడా చూడాలని అనుకుంటున్నారు. అందుకే బాలయ్య నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఆ సినిమాకు అనిరుద్ తోనే మ్యూజిక్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు. మరి బాలకృష్ణ కు అనిరుద్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది చూడాలి.