Bigg Boss 6: సైకోగా మారిన గీతూ.. గుక్కపెట్టి ఏడుస్తున్న బాలాదిత్య!
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గీతూ నీ ముందు తిట్టి ఫుల్ గా
- By Nakshatra Published Date - 02:53 PM, Tue - 1 November 22
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గీతూ నీ ముందు తిట్టి ఫుల్ గా క్లాస్ పీకినా కూడా గీతూ బుద్ధి మారలేదు. తాజాగా కూడా తన మొండి ప్రవర్తన నీచమైన ప్రవర్తనతో మళ్ళీ రెచ్చిపోయింది గీతూ. బాలాదిత్య ఎమోషన్స్ తో ఆడుకొని అతని ఏడిపించేసింది. ఎంతమంది చెబుతున్నా కూడా తన ఆట తీరు మాత్రం మార్చుకోలేదు. తాజాగా బిగ్ బాస్ ఒక టాస్క్ ని ఇచ్చాడు. ఆ టాస్క్ లో భాగంగా గీతూ శ్రీ సత్య శ్రీహాన్‌ల మాట విని బాలాదిత్య లైటర్ ను దాచింది. వారి ముగ్గురూ కలిసి బాలాదిత్య వీక్నెస్ ని దెబ్బ కొట్టాలని స్కెచ్ వేశారు.
ఈ క్రమంలోనే బాలాదిత్య లైటర్ ని గీతూ తన టీ షర్టు లోపల దాచుకుంది. తరువాత శ్రీ సత్య,గీతూ లు ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ పగలబడి నవ్వారు. బాలాదిత్యా లైటర్ ఎవరు తీశారు అని అడగగా మొదట ఎవరు తీయలేదు అని చెప్పి ఆ తర్వాత గేమ్‌లు రెండు స్క్రిప్టులు ఇస్తే లైటర్ ఇస్తామని గీతూ శ్రీసత్య లు అన్నారు. అప్పుడు బాలాదిత్యా గెలిస్తే ఆటలో గెలవాలి కానీ ఇదేం పద్ధతి అని అంటాడు. అప్పుడు గీతూ మళ్లీ రెండు బ్లూ స్క్రిప్స్ తేనే లైటర్ ఇస్తాను అంటూ గీతూ జారిపోవడంతో వెంటనే బాలాదిత్యా చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు గీతూ అనగా నేను చీప్ దాన్నే థాంక్యు సో మచ్ అంటూ మరింత దిగజారిపోయింది గీతూ .
ఆ తర్వాత మళ్లీ రెండు స్ప్రెక్టులు ఇస్తే లైటర్ ఇస్తా అంటూ మళ్లీ అదే మాట మాట్లాడింది. అప్పుడు బాలాదిత్య ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా.. నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ ఎమోషనల్ అవడంతో శ్రీహాన్ ఏమీ ఎరగనట్టుగా వచ్చి ఓదారుస్తున్నాడు. అప్పుడు రేవంత్ నువ్వు రాంగ్ చేస్తున్నావ్ గీతూ అని అనగా ఏంటి రాంగ్ అంటూ గీతు మళ్ళి నీచంగానే మాట్లాడింది.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి