Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ కొత్త అవతారం ‘బ్యాడాస్’: ఫస్ట్ లుక్‌తోనే హంగామా
Siddhu Jonnalagadda : ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో యువతను ఊపేసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు మరింత రఫ్ అండ్ రా అవతారంలో కనిపించబోతున్నారు.
- By Kavya Krishna Published Date - 03:27 PM, Wed - 9 July 25

Siddhu Jonnalagadda : ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో యువతను ఊపేసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు మరింత రఫ్ అండ్ రా అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన, దర్శకుడు రవికాంత్ పేరెపు కలయికలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘బ్యాడాస్’. ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. “If middle finger was a man” అనే బోల్డ్ ట్యాగ్‌లైన్‌తో సిద్ధు పాత్రకు గట్టి స్థాయిలో రగడ ఫ్లేవర్ ఇచ్చారు.
ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా స్కేల్ పరంగా, స్టైల్ పరంగా గట్టిపోటి ఇవ్వనున్నట్లు సినిమా బృందం చెబుతోంది. బడా బడ్జెట్‌తో, వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా సిద్ధు జొన్నలగడ్డను ప్రేక్షకులు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా చూడబోతున్నారు.
Second Hand Cars : సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడం వల్ల లాభాలు , నష్టాలు ఇవే !!
ఇదే కాంబినేషన్‌లో ఒకానొక సమయంలో ‘కోహినూర్’ అనే సినిమా ప్రకటించారు. కానీ అది ఎప్పుడో మూలనపడిపోయింది. ఇప్పుడు అదే జంట ‘బ్యాడాస్’ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా కథకు సిద్ధు జొన్నలగడ్డ కథా రచయితగానూ పనిచేస్తుండటం మరింత ఆసక్తికర అంశం.
‘టిల్లు’ ఫ్రాంచైజ్ తర్వాత సిద్ధు చేస్తున్న ఈ మూడో సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. తప్పుడు వ్యవస్థలకు, మనిషి కోపానికి, అంతర్భాగంగా ఉన్న అసహనానికి రూపకల్పనగా ఈ సినిమాలోని పాత్ర ఉండబోతోందన్న సంకేతాలు పోస్టర్‌లోనే కనిపిస్తున్నాయి. భావోద్వేగాలతో కూడిన మాస్ డ్రామా జానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thalliki Vandanam 2nd List : రేపే ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు విడుదల