Baby Movie : 10 రోజులు అవుతున్న బాక్స్ ఆఫీస్ వద్ద బేబీ హావ తగ్గట్లే
బేబీ థియేటర్స్ లోకి వచ్చి పది రోజులు కావొస్తున్న ఇంకా హౌస్ ఫుల్ తో అన్ని షోస్ రన్
- Author : Sudheer
Date : 24-07-2023 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
కథలో దమ్ము ఉండాలే కానీ ఎన్ని ఓటిటి లు వచ్చిన , పైరసీ లు వచ్చిన ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమాను చూస్తారని మరోసారి బేబీ (Baby Movie) సినిమా నిరూపించింది. ప్రస్తుతం సినీ జనాలకు ఏం కావాలో..? ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో..? అలాంటిది తీసుకొచ్చారు డైరెక్టర్ సాయి రాజేష్. చిన్న హీరో ఆనంద్ దేవరకొండ తో , షార్ట్ ఫిలిమ్స్ ఫేమ్ తో గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి(Vaishnavi Chaitanya)ని హీరోయిన్ గా పరిచయం చేసి నిర్మాత SKN భారీ విజయాన్ని అందుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల లాభాన్ని అందుకుంటున్నారు.
బేబీ థియేటర్స్ లోకి వచ్చి పది రోజులు కావొస్తున్న ఇంకా హౌస్ ఫుల్ తో అన్ని షోస్ రన్ అవుతున్నాయంటే యూత్ ను ఎంతగా ఆకట్టుకుందో అర్ధం అవుతుంది. అంతే కాదు 7 వ రోజు కూడా మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు (Baby Collections) రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇక 10 రోజుల్లో ఈ మూవీ (Baby Collections) కలెక్ట్ చేసిన వసూళ్లు చూస్తే..
నైజాంలో రూ. 12.06 కోట్లు
సీడెడ్‌లో రూ. 4.08 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 4.63 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 2.03 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు
గుంటూరులో రూ. 1.45 కోట్లు
కృష్ణాలో రూ. 1.59 కోట్లు
నెల్లూరులో రూ. 88 లక్షలతో కలిపి.. రూ. 27.85 కోట్లు షేర్, రూ. 51.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.
అలాగే ఓవర్సీస్‌లో రూ. 2.38 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.48 కోట్లు వసూళ్లు చేసింది. ఓవరాల్ గా 10 రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 31.71 కోట్లు షేర్, రూ. 66.00 కోట్లు గ్రాస్ రాబట్టి, నిర్మాత SKN బ్యాంకు అకౌంట్ ను ఫుల్ చేసింది.
Read Also: Gandeevadhari Arjuna Teaser : గాండీవధారి అర్జున టీజర్ టాక్ ..