Avatar 3 Tickets: ‘అవతార్ 3’ టికెట్ బుకింగ్స్ తేదీ ఖరారు!
విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని భారతదేశంలో IMAX ఫార్మాట్‌లో చూడాలనుకునే అభిమానుల కోసం బిగ్ అప్డేట్ ఉంది. భారతదేశంలో IMAX ఫార్మాట్ కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- By Gopichand Published Date - 07:36 PM, Mon - 1 December 25
Avatar 3 Tickets: ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar 3 Tickets) కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజువల్ వండర్‌గా ప్రఖ్యాతి గాంచిన ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన మూడవ భాగం విడుదల కానుండగా.. తాజాగా కామెరూన్ చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కామెరూన్ సంచలన నిర్ణయం
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కామెరూన్.. తన తాజా చిత్రం అవతార్ 3 బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైతే, తాను ఈ ‘అవతార్’ ఫ్రాంచైజీని శాశ్వతంగా ముగింపు పలుకుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద సాహసోపేతమైన ప్రకటన అయినప్పటికీ తాను ప్రేక్షకులకు అందించిన కథ, అత్యాధునిక విజువల్స్ పట్ల ఆయనకు ఎంత అచంచలమైన నమ్మకం ఉందో స్పష్టం చేస్తోంది. ఈ ప్రకటన మూడవ భాగంపై అంచనాలను మరింత పెంచింది.
Also Read: Samantha 2nd Wedding : సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!
టికెట్ బుకింగ్స్ అప్‌డేట్
కామెరూన్ ప్రకటనతో చిత్రంపై ఏర్పడిన భారీ క్రేజ్ మధ్య భారతీయ ప్రేక్షకులు టికెట్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. తాజాగా దేశీయ పంపిణీదారు ఈ నిరీక్షణకు ముగింపు పలుకుతూ అధికారిక తేదీని ధృవీకరించారు. డిసెంబర్ 5, 2025 నుండి ఈ సినిమా టికెట్ బుకింగ్స్ గ్రాండ్‌గా ప్రారంభమవుతాయి. ఈ బుకింగ్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళంతో సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లోనూ అందుబాటులో ఉంటాయి.
గత రెండు భాగాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా ముందస్తు బుకింగ్స్ ద్వారా బలమైన డిమాండ్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవతార్ 3 చిత్రంలో కూడా సామ్ వర్తింగ్టన్, జో సల్దానా తమ కీలక పాత్రల్లో తిరిగి రానున్నారు. దీనికి జేమ్స్ కామెరూన్‌తో పాటు జాన్ ల్యాండౌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని భారతదేశంలో IMAX ఫార్మాట్‌లో చూడాలనుకునే అభిమానుల కోసం బిగ్ అప్డేట్ ఉంది. భారతదేశంలో IMAX ఫార్మాట్ కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో IMAX లో వీక్షించే అవకాశం ఉండదు.