Ashish Reddy Love Me : లవ్ మీ అంటున్న ఆశిష్.. దెయ్యంతో లవ్వాట ఎలా ఉంటుందో..?
Ashish Reddy Love Me దిల్ రాజు ఇంటి వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా మొదటి సినిమా రౌడీ బాయ్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా పర్వాలేదు అనిపించగా రెండో సినిమా సెల్ఫిష్ తో
- By Ramesh Published Date - 10:29 AM, Wed - 28 February 24
Ashish Reddy Love Me దిల్ రాజు ఇంటి వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా మొదటి సినిమా రౌడీ బాయ్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా పర్వాలేదు అనిపించగా రెండో సినిమా సెల్ఫిష్ తో వస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే తన థర్డ్ సినిమా అనౌన్స్ మెంట్ తో వచ్చాడు ఆశిష్. ఈసారి లవ్ మె అంటూ ఒక థ్రిల్లర్ లవ్ స్టోరీతో వస్తున్నాడు.
ఈ సినిమాను అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు బ్యానర్ లో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డు, నాగ మల్లిడి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి లేటెస్ట్ గా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూపించారు.
దెయ్యంతో లవ్వాట చేస్తున్న ఆశిష్ లవ్ మీ అంటూ అతను దెయ్యాన్ని అడుగుతాడా.. లేదా దెయ్యమే అతన్ని అడుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి దిల్ రాజు చెబుతూ ఆర్య టైం లో కథ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అదే కొత్త ఫీలింగ్ ఈ సినిమా కథ విన్నప్పుడు కలిగిందని చెప్పారు. మరి ఆశిష్ లవ్ మీ ఎలా ఉండబోతుందో చూడాలి. బేబీ తర్వాత వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న వైష్ణవి చైతన్యకు ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు.
Tags
Related News
Vijay Devarakonda Rashmika : రష్మికతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ..?
Vijay Devarakonda Rashmika రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో కూడా మరో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. అంతకుముందు వచ్చిన ఖుషితో పర్వాలేదు అనిపించుకున్న