Prabhas: ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా!
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ ఎవరైనా ఉన్నారా అంటే.. మొదటగా ప్రభాస్ అని చెప్పుకోవాలి. ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు, సినిమావాళ్లు కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
- By Balu J Published Date - 12:48 PM, Sat - 5 March 22
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ ఎవరైనా ఉన్నారా అంటే.. మొదటగా ప్రభాస్ అని చెప్పుకోవాలి. ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు కాకుండా.. సినిమావాళ్లు కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సూపర్ స్టార్ ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. అయితే అది పెద్దలు కుదిర్చిన వివాహమని టాలీవుడ్ టాక్. ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టిలు ప్రేమించుకుంటున్నారని, భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వచ్చాయి. అయితే ప్రభాస్ ఫ్యామిలీకి దగ్గర ఉన్న ఓ హీరో భార్య రియాక్ట్ అవుతూ.. “ప్రభాస్ తన కుటుంబ సభ్యలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోరు. అతను పూర్తి ఫ్యామిలీ మ్యాన్. తన తల్లి, పెద్దలు కుదుర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు” అని అంటోంది.
ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఖరారైంది. కానీ ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కృష్ణంరాజు వారసుడిగా తేరంగేట్రం చేసినా ప్రభాస్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు. ఈశ్వర్, వర్షం, ఛత్రపతి, బుజ్జి, మిర్చి లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, సలార్ లాంటి సినిమాలతో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్యాన్ హీరోగా అవతారమెత్తాడు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�