Vamshi Paidipally : వంశీ కి మీడియం రేంజ్ హీరోలు పనికిరారా..?
Vamshi Paidipally : ఇదే సమయంలో చిన్న చిన్న డైరెక్టర్లు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి వరుస సినిమాలు తీస్తూ బిజీ గా మారిపోతున్నారు
- By Sudheer Published Date - 07:56 PM, Sun - 18 May 25

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఒకరు. బృందావనం, ఊపిరి, మహర్షి, వారసుడు లాంటి సూపర్ హిట్ సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న వంశీ, గత రెండు సంవత్సరాలుగా మాత్రం ఒక్క సినిమాను కూడా ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్నాడు. దీంతో ఆయన అభిమానులు , సినీ లవర్స్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి వంశీకి స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలన్న పట్టుదల ఉండటమే ఆయన ఆలస్యానికి కారణమవుతోంది.
Kodali Nani : లోపల వేస్తారనే భయంతోనే నాని అమెరికాకు వెళ్తున్నాడా..?
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అమీర్ ఖాన్ లాంటి పెద్ద నటులతో సంప్రదింపులు చేసినప్పటికీ, అవి వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం టాప్ హీరోలు అందుబాటులో లేకపోవడం, తమ పాత కమిట్మెంట్లతో బిజీగా ఉండడం వల్ల వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే ఇదే సమయంలో చిన్న చిన్న డైరెక్టర్లు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి వరుస సినిమాలు తీస్తూ బిజీ గా మారిపోతున్నారు. వీరిని చూసైనా వంశీ మనసు మార్చుకొని , మీడియం హీరోలతో సినిమాలు చేసే సత్తా చాటాలని కోరుకుంటున్నారు. మరి వంశీ తన రూట్ ను మార్చుకుంటారా..లేదా అనేది చూడాలి.