AR Rahman Divorce : భార్య సైరాకు విడాకులు.. ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ మెసేజ్
ఏఆర్ రెహమాన్, సైరా బానుల కుమారుడు అమీన్(AR Rahman Divorce) ఈ అంశంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.
- By Pasha Published Date - 10:04 AM, Wed - 20 November 24

AR Rahman Divorce : తన భార్య సైరా బాను నుంచి విడాకులు తీసుకుంటున్న అంశంపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తొలిసారి ఎమోషనల్‌గా స్పందించారు. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత తాము విడిపోతున్నందుకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. దీనిపై బుధవారం తెల్లవారుజామున ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక మెసేజ్ రాసుకొచ్చారు.
Also Read :Suicide Attack : ఉగ్రవాదుల సూసైడ్ ఎటాక్.. 10 మంది పాక్ సైనికులు మృతి
‘‘మా వైవాహిక జీవితం 29 వసంతాలను పూర్తి చేసుకుంది. విజయవంతంగా 30వ వసంతంలోకి అడుగుపెట్టాలని నేను, సైరా కోరుకున్నాం. కానీ అది సాధ్యపడేలా లేదు. మేం అనుకోకుండా విడిపోవాల్సి వస్తోంది. జరగబోయే ఎడబాటులో కూడా మేం పరమార్థాన్ని వెతుకుతున్నాం. మళ్లీ మేం కలిసే అవకాశం బహుశా ఉండకపోవచ్చు. విరిగిపోయిన మనసుల బరువుకు ఆ దేవుడి సింహాసనం కూడా అదురుతుందేమో. ఈ బలహీన సమయంలో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మా గోప్యతను గౌరవించినందుకు థ్యాంక్స్’’ అని తన మెసేజ్‌లో ఏఆర్ రెహమాన్ రాసుకొచ్చారు. ఈ మెసేజ్‌కు ఆయన ‘ARR Sairaa Breakup’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా యాడ్ చేయడం గమనార్హం. ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.. ఖతీజా, రహీమా, అమీన్.
Also Read :Kiara Advani : 2025 కియరా అద్వాని.. మోత మోగించేస్తుందా..?
కుమార్తె ఖతీజా ఇన్‌స్టా స్టోరీ
తమ పేరెంట్స్ ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోతుండటంపై కుమార్తె ఖతీజా రెహమాన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను పోస్ట్ చేశారు. ‘‘ఈ విషయాన్ని అత్యంత గోప్యత, గౌరవంతో వ్యవహరించగలిగితే నేను చాలా అభినందిస్తాను. మీ పరిశీలనకు ధన్యవాదాలు’’ అని ఆమె రాసుకొచ్చారు.
కుమారుడు అమీన్ ఇన్‌స్టా స్టోరీ
ఏఆర్ రెహమాన్, సైరా బానుల కుమారుడు అమీన్(AR Rahman Divorce) ఈ అంశంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఇలాంటి విషయాల్లో గోప్యత పాటించడం చాలా ముఖ్యమన్నారు. రెహమాన్, సైరాబానుల గోప్యతను అందరూ గౌరవించాలని కోరారు. ఈవిషయాన్ని అందరూ అర్థం చేసుకున్నందుకు అమీన్ ధన్యవాదాలు తెలిపారు.