Kalki 2898 AD : ‘కల్కి’ టీం కు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
రోజుకు ఆరు షో లు వేసుకునే వెసులుపాటు కల్పించింది. ఈ ప్రకటన తో అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు
- By Sudheer Published Date - 08:48 PM, Wed - 26 June 24

యావత్ ప్రభాస్ (Prabhas) అభిమానులు , సినీ లవర్స్ , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కల్కి’ (Kalki 2898 AD) మూవీ మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే మూడు రోజులకు గాను టికెట్స్ అమ్ముడయ్యాయి. టికెట్స్ ఎక్కడైనా దొరుకుతాయా..అని ఫ్యాన్స్ వెతుకుతున్నారు. ఇక ఏపీలో కల్కి టీం కు కూటమి సర్కార్ తీపి కబురు తెలిపిన సంగతి తెలిసిందే.
మొన్నటి వరకు ఏపీ టికెట్ ధరలు చాల తక్కువగా ఉండగా..ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి సర్కార్ కల్కి కి గుడ్ న్యూస్ అందించింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై 125 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.ఇక ఇప్పుడు మరో తీపి కబురు తెలిపి అభిమానుల్లో , మూవీ టీం లో సంతోషం నింపింది. రోజుకు ఆరు షో లు వేసుకునే వెసులుపాటు కల్పించింది. ఈ ప్రకటన తో అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె మరికాసేపట్లో సినిమా విడుదల కానుండగా..డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లోనూ ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హీరో ప్రభాస్‌తో కలిసి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ వచ్చారు. ప్రభాస్‌తో ముచ్చటించిన ఆయన ఫ్యాన్స్ కోసం సూపర్ అప్డేట్స్ను షేర్ చేశారు. ఇక డార్లింగ్ కూడా పలు సీక్రెట్స్‌ను రివీల్ చేశారు.
“క్లైమాక్స్‌లో ఓ సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది. సెకెండాఫ్‌లో దాదాపు 80 శాతం యాక్షన్ సీన్సే ఉంటాయి. ఇక మూవీ స్టార్ట్ అయిన 20-22 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇది బెస్ట్ ఇంట్రో సీన్ అని నా అభిప్రాయం” అంటూ నాగ్ అశ్విన్ వెల్లడించారు.ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్, విజయ్‌దేవరకొండకు ఇదే లైవ్‌లో స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
Read Also : Family Tips : అత్తాకోడళ్ల గొడవలకు ఇదే చివరి పరిష్కారం..!