Malavika Mohanan : అనుష్క, సమంత ఇద్దరూ ఇష్టమే అంటున్న రాజా సాబ్ బ్యూటీ..!
Malavika Mohanan మాళవికకు ఇష్టమైన తెలుగు హీరోయిన్స్ గురించి ఒక ఫాలోవర్ అడిగాడు. అందుకు అమ్మడు సమాధానంగా అనుష్క, సమంత
- Author : Ramesh
Date : 29-04-2024 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
Malavika Mohanan మలయాళ భామ మాళవిక మోహనన్ మాతృ భాషలో సినిమాలు చేస్తూనే సౌత్ ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది మాళవిక. ప్రస్తుతం తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న అమ్మడు ఆ సినిమా తర్వాత తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. ఇప్పటికే తనకు ఆఫర్లు వస్తున్న ఆఫ్టర్ రాజా సాబ్ రిలీజ్ అంటూ చెబుతుందట.
సినిమాలతో పాటు ఫోటో షూట్ లో గ్లామర్ షోతో కూడా ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది మాళవిక. అందుకే అమ్మడు ఎప్పుడు ఫోటో షూట్ షేర్ చేస్తుందా అని ఆమె ఫాలోవర్స్ ఎదురుచూస్తుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మాళవిక లేటెస్ట్ గా ఎక్స్ లో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. తనని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోండని బంపర్ ఆఫర్ ఇచ్చింది.
Also Read : Dhanush Kubera Teaser : ధనుష్ కుబేర.. ఇది మామూలు స్పీడు కాదు బాబోయ్..!
ఈ క్రమంలో మాళవికకు ఇష్టమైన తెలుగు హీరోయిన్స్ గురించి ఒక ఫాలోవర్ అడిగాడు. అందుకు అమ్మడు సమాధానంగా అనుష్క, సమంత అని ఆన్సర్ ఇచ్చింది. సీనియర్ హీరోయిన్స్ అయిన అనుష్క, సమంత అంటే ఏ తెలుగు ప్రేక్షకుడికైనా ఇష్టమే.
తెలుగులో వరుస సినిమాలు చేయడానికి ముందే అమ్మడు ఇక్కడ ఆడియన్స్ ను బుట్టలో వేసుకుంటుంది. రాజా సాబ్ హిట్ పడితే మాత్రం మాళవిక టాలీవుడ్ లో ఫేవరెట్ హీరోయిన్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.