ANR National Award : చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్..!
ANR National Award ఏఎన్నార్ అవార్డ్ ప్రధానోత్సవానికి అమితాబ్ బచ్చన్ గెస్ట్ గా వస్తారని అన్నారు నాగార్జున. చిరంజీవికి ఏఎన్నార్ అవార్డ్ అందించడంతో అక్కినేని ఫ్యాన్స్ తో
- Author : Ramesh
Date : 21-09-2024 - 7:19 IST
Published By : Hashtagu Telugu Desk
ANR National Award అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకంగా అక్కినేని ఫ్యామిలీ ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికో, రెండేళ్లకు ఒకసారి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ ప్రధానోత్సవం జరుగుతుంది. ఈసారి ఏఎన్నార్ శత జయంతి సంవత్సరం సందర్భంగా లేటెస్ట్ గా నాగార్జున ఏఎన్నార్ నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ అవార్డుకి ఆయన అన్ని విధాలుగా అర్హుడని నాగార్జున అన్నారు.
చిరంజీవి కూడా తనకు ఈ అవార్డ్ ఎంతో గొప్పదని చెప్పారని అన్నారు. అక్టోబర్ 28న ఈ అవార్డ్ వేడుక నిర్వహిస్తామని నాగార్జున చెప్పారు. ఏఎన్నార్ (ANR) అవార్డ్ ప్రధానోత్సవానికి అమితాబ్ బచ్చన్ గెస్ట్ గా వస్తారని అన్నారు నాగార్జున. చిరంజీవికి ఏఎన్నార్ అవార్డ్ అందించడంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు.
స్వయంకృషితో పైకొచ్చి స్టార్ గా ఎదిగిన చిరు..
చిరంజీవి అంటే నాగార్జునకు ప్రత్యేక అభిమానం. స్వయంకృషితో పైకొచ్చి స్టార్ గా ఎదిగిన చిరు అంటే కింగ్ నాగార్జున ( Nagarjuna)కు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి గురించి నాగార్జున చాలా గొప్పగా చెబుతారు.
ఆ తరంలో వెండితెర మీద చిరంజీవి (Chiranjeevi) చేసిన అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన స్టామినా ఏంటన్నది నాగార్జునకు తెలుసు. అందుకే చిరు విషయంలో నాగార్జున ఎప్పుడు చాలా అభిమానంతో మాట్లాడుతుంటారు. ఇక ఇప్పుడు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ తో ఆయన్ను సత్కరించనున్నారు. ఈ అవార్డ్ వేడుకతో మరోసారి అక్కినేని మెగా ఫ్యామిలీ బంధం బలపడనుంది.
Also Read : Onion Secret : రెస్టారెంట్‌లో వడ్డించే ఉల్లిపాయ ఎందుకు రుచికరంగా ఉంటుంది? ఇదీ కారణం..!