Ram Charan Game Changer Photo Leak : గేమ్ చేంజర్ నుంచి మరో లీక్.. స్టేజ్ మీద నుంచి హీరోని నెట్టేసిన రౌడీలు..!
Ram Charan Game Changer Photo Leak మెగా పవర్ స్టార్ రాం చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్
- Author : Ramesh
Date : 26-03-2024 - 11:52 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Charan Game Changer Photo Leak మెగా పవర్ స్టార్ రాం చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో చరణ్ ఒక సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తుండగా అవినీతి అధికారులను, రాజకీయ నేతలను కడిగి పారేసే పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.
గేమ్ చేంజర్ సినిమా మొదలైన నాటి నుంచి సినిమా నుంచి ఏదో ఒక లీక్ బయటకు వస్తూనే ఉంది. చిత్ర యూనిట్ ఎంత ట్రై చేసినా సరే ఈ లీక్స్ ఆగట్లేదు. లేటెస్ట్ గా సినిమా నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. సినిమా లో ఒక పొలిటికల్ మీటింగ్ లో స్టేజ్ మీద నుంచి చరణ్ ని కిందకు నెట్టేసే సీన్ ఫోటో లీక్ అయ్యింది.

సినిమా షూటింగ్ చేస్తున్న టైం లో కెమెరాలు కూడా షూటింగ్ స్పాట్ లో అలో చేయరు. కానీ ఎవరో కొందరు సినిమా యూనిట్ లోనే ఇలా కొన్ని సీన్స్ ఫోటో తీసి లీక్ చేస్తారు. రీసెంట్ గా వైజాగ్ లో షూటింగ్ జరుపుకున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి ఈ ఫోటో లీకైనట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ నుంచి జరగండి సాంగ్ రాం చరణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం రిలీజ్ కాబోతుంది.
Also Read : Ram Charan : తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్..