Prabhas: విలన్ గా కనిపించబోతున్న ప్రభాస్.. ఏ సినిమాలో తెలుసా?
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్
- By Nakshatra Published Date - 06:48 PM, Sun - 16 April 23
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆది పురుష్ సినిమా పూర్తి కాగా ఈ సినిమాపై విమర్శలు రావడంతో ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేస్తూనే ఉన్నారు.
దీంతో ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా నెలకొంటున్నాయి. ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.
అదేంటి అన్న విషయానికి వస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోలు హీరోల్లా కనిపించరు. విలన్ లాగే కనిపిస్తూ ఉంటారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఉగ్రం సినిమాలలో హీరోలు నెగటివ్ షేడ్స్ తో హీరోలు ఎస్టాబ్లిష్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సలార్ సినిమాలో ప్రభాస్ ని కూడా ఇదే పంథాలో చూడబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడట. నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ గా ఇందులో నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఇందులో ఫర్మాన్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ దేవా అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతి క్రూరమైన కనికరం లేని పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా ప్రభాస్ ఇందులో కనిపించబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో ఆ చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Related News
Prabhas : ప్రభాస్ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఓటు వేయలేదు.. అసలు ఎక్కడున్నాడు..?
ప్రభాస్ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ ఓటు వేయలేదు.. అసలు రెబల్ స్టార్ ఎక్కడున్నాడు..?