Anjana Devi : అంజనాదేవికి సీరియస్… హాస్పటల్ కు బయలుదేరిన చిరు, పవన్
Anjana Devi : తల్లి హాస్పటల్ (Anjana Devi hospitalized) లో జాయిన్ చేశారనే వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. అమరావతిలో జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశం మధ్యలోనే హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు
- Author : Sudheer
Date : 24-06-2025 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి (Anjana Devi ) ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందనే వార్త మెగా ఫ్యామిలీ తో పాటు మెగా అభిమానులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. తల్లి హాస్పటల్ (Anjana Devi hospitalized) లో జాయిన్ చేశారనే వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. అమరావతిలో జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశం మధ్యలోనే హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. అంజనాదేవి ఆరోగ్యం పై మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఇప్పటి వరకు అఫిషియల్ సమాచారం వెలువడలేదు. కాకపోతే మీడియా లో మాత్రం ఆమెను హాస్పటల్ లో జాయిన్ చేసారని , మెగా ఫ్యామిలీ సభ్యులు హాస్పటల్ కు వెళ్తున్నారనే వార్తలు మాత్రం ప్రచారం అవుతున్నాయి.
Iran: ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ.. ఇరాన్ అధికారిక ప్రకటన
అంజనాదేవికి ముగ్గురు కుమారులు – చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. వారిలో చిరంజీవి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అగ్ర కథానాయకుడు. ఆయన్ను అనుసరించిన నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లోకి ప్రవేశించారు. అంజనాదేవి పవన్ కళ్యాణ్ పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. ఆయన గురించి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం విషమించడంతో మెగా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం అంజనాదేవిని చికిత్స కోసం తరలించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రయాణంలో ఉన్నారు. చిరంజీవి, నాగబాబు హైదరాబాద్‌లో ఉండటంతో వారు ఆసుపత్రికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.