Bahishkarana Trailer : ‘బహిష్కరణ’ ట్రైలర్ రిలీజ్.. బాబోయ్ అంజలి విశ్వరూపం చూపించిందిగా..
- By News Desk Published Date - 07:13 PM, Wed - 10 July 24

Bahishkarana Trailer : యాబైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా, ముఖ్య పాత్రల్లో నటించిన అంజలి ఇటీవల అన్ని కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మాస్ పాత్రలో కనిపించిన అంజలి ఇప్పుడు దానికి మించి రాబోతుంది. అంజలి మెయిన్ లీడ్ లో బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో ఈ సిరీస్ రాబోతుంది.
తాజాగా బహిష్కరణ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడ్నుంచో ఓ ఊరికి వచ్చిన పుష్ప(అంజలి) అక్కడ ఒకరితో ప్రేమలో పడ్డాక ఆ ఊళ్ళో పెద్దగా ఉండే వ్యక్తి వీళ్లపై చేసే దురాగతాలు, దానికి వీళ్ళు తీర్చుకునే రివెంజ్ ఏంటి అని ఓ పక్క అందంగా చూపిస్తూనే మరో పక్క రా రస్టిక్ గా చూపించారు. ట్రైలర్ చూస్తుంటేనే అంజలి విశ్వరూపం చూపించేసింది. ఇక సిరీస్ లో ఇంకే రేంజ్ లో నటించిందో చూడాలి.
ఈ సిరీస్ లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. బహిష్కరణ సిరీస్ లో అనన్య నాగళ్ళ, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, షణ్ముక్, చైతన్య సాగిరాజు.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న అంజలి ఈ సిరీస్ తో ఇకపై ఓటీటీలో కూడా దూసుకుపోతుందేమో.
Also Read : Thangalaan Trailer : తంగలాన్ ట్రైలర్ రిలీజ్.. వామ్మో విక్రమ్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు..