Geethanjali Malli Vachindhi : ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ చూసారా? నవ్వుతూ భయపడాల్సిందే..
తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
- By News Desk Published Date - 10:48 AM, Sun - 25 February 24

తెలుగు హీరోయిన్ అంజలి(Anjali) మెయిన్ లీడ్ లో గతంలో వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi)సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం. కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గీతాంజలి సినిమాలో ఉన్న శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్.. క్యారెక్టర్స్ తో పాటు సునీల్, అలీ, అవినాష్.. మరింతమంది ఈ సీక్వెల్ లో తోడయ్యారు.
తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్విస్తూనే భయపెట్టింది. ఈసారి కథలో.. ఓ మూవీ యూనిట్ దయ్యాల బంగ్లాలో షూటింగ్ పెట్టుకుంటే అక్కడ దయ్యాలు వీళ్ళని భయపెట్టడం, ఆ దయ్యాలకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం లాంటి కథతో సాగనుంది. టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మార్చ్ 22న రిలీజ్ కానుంది.
ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ మొదట స్మశానంలో పెడతామని ప్రకటించి తర్వాత ఓ హోటల్ కి మార్చారు. ఈ ఈవెంట్ కి హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా వచ్చాడు.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన సీనియర్ నటుడు.. ఎవరో తెలుసా?