Animal : 2023 బెస్ట్ మూవీ యానిమల్ అంటున్న కరణ్ జోహార్..!
Animal బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ 2023 లో బెస్ట్ మూవీ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన అభిప్రాయం ప్రకారం 2023 లో రిలీజైన
- By Ramesh Published Date - 05:52 PM, Tue - 2 January 24

Animal బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ 2023 లో బెస్ట్ మూవీ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన అభిప్రాయం ప్రకారం 2023 లో రిలీజైన సినిమాల్లో సందీప్ వంగ తెరకెక్కిన యానిమల్ సినిమా బెస్ట్ మూవీ అని కరణ్ జోహార్ అభిప్రాయపడ్డారు. తనకు సందీప్ వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ కూడా బాగా నచ్చిందని యానిమల్ కూడా అదే రేంజ్ లో ఉందని అన్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ విషయంలో ఎవరేమి అనుకున్నా తనకు ఎలాంటి సమస్య లేదని తనకు ఇష్టం కబట్టే ఖచ్చితంగా తేల్చి చెప్పానని అన్నారు కరణ్ జోహార్. కథ, కథనం కీల అంశాల్లో కూడా దర్శకుడు సందీప్ వంగ గత సినిమాల్లోని మూస పద్ధతిని ఫాలో అవ్వకుండా ఉన్నారని. సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ బాగున్నాయని అన్నారు.
ఈ సినిమాలో నటించిన రణ్ బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో పాటుగా అందరికీ తన అభినందనలు తెలిపారు కరణ్ జోహార్. యానిమల్ సినిమా రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించగా సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించారు. డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు 860 కోట్ల పైన కలెక్ట్ చేసింది. రణ్ బీర్ కపూర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.
Also Read : Teja Sajja : మహేష్ కి పోటీ కాదు.. కలిసి వస్తున్నాం..!