Anil Ravipudi : వెంకటేష్ పాటకి దర్శకుడు అనిల్ రావిపూడి డాన్స్ అదుర్స్..
వెంకటేష్ పాటకి దర్శకుడు అనిల్ రావిపూడి సేమ్ స్టెప్స్ వేసి అదుర్స్ అనిపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
- By News Desk Published Date - 11:35 AM, Mon - 20 May 24

Anil Ravipudi : దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు మాత్రమే కాదు, ఆయన కూడా ఎంతో జోష్ తో కనిపిస్తుంటారు. తన సినిమాలతోనే కాదు, తన చుట్టూ ఉన్నవారిని కూడా అనిల్ రావిపూడి బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు. తాజాగా ఈ దర్శకుడు.. వెంకటేష్ పాటకి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు. నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని అతిథులుగా వచ్చారు.
ఇక ఈ డైరెక్టర్స్ డే ఈవెంట్ ని టాలీవుడ్ దర్శకులు ఫుల్ జోష్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈక్రమంలోనే అనిల్ రావిపూడి డాన్స్ వేసి అదరగొట్టారు. వెంకీ మామ సూపర్ హిట్ సాంగ్ ‘బలపం పట్టి’ పాటకి సేమ్ స్టెప్స్ వేసి అదుర్స్ అనిపించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఈవెంట్ ని నిన్న ఎక్కడ ప్రసారం చేయలేదు. ఓటీటీలో ఈ ఈవెంట్ ని రిలీజ్ చేయనున్నారట.
విక్టరీ వెంకటేష్ సాంగ్ కి @AnilRavipudi డాన్స్ 🕺👌#TFDAEvent pic.twitter.com/kUhlWnbjeW
— Rajesh Manne (@rajeshmanne1) May 19, 2024
As it is దించేశారు @VenkyMama గారిని ఈ స్టెప్ తో @AnilRavipudi 🕺👌 pic.twitter.com/OONEUMWKBi
— Rajesh Manne (@rajeshmanne1) May 19, 2024
అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ప్రస్తుతం వెంకీ మామతో కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో F2, F3 సినిమాలు ఆడియన్స్ ముందుకు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఈసారి ముల్టీస్టారర్ కాకుండా ఒక స్టాండ్ ఎలోన్ సినిమా చేస్తున్నారు. మాజీ ప్రియురాలు మరియు భార్య మధ్య నలిగిపోయే భర్తగా, మాజీ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ నటించబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఈ హిట్ కాంబో ఈ మూవీతో ఎలా అలరిస్తారో చూడాలి.