Anchor Sravanthi : బెడ్‌పై వైన్ బాటిల్ తో రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి
Anchor Sravanthi : వైన్ తాగుతూ కేక్ కట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక తన గ్లామర్ షోతో అభిమానుల మతి పోగొడుతున్న స్రవంతిపై నెటిజన్లు "హీరోయిన్ మెటీరియల్" అంటూ కామెంట్లు
- By Sudheer Published Date - 10:51 AM, Mon - 9 June 25
యాంకర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన స్రవంతి చొక్కారపు (Anchor Sravanthi) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఒకప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేసిన ఈ బ్యూటీ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అనంతరం ‘పుష్ప’ మూవీ యూనిట్‌తో చేసిన ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ అల్లు అర్జున్, సుకుమార్‌లను ఆకట్టుకున్న స్రవంతి, ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయారు.
Venkaiah Naidu : ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం: వెంకయ్యనాయుడు
తన యాంకరింగ్ టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి, తర్వాత పలు టీవీ షోలు చేస్తూ తన పాపులారిటీ పెంచుకున్నారు. ఈ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోషూట్లు, గ్లామరస్ రీల్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటూ వస్తుంది. పెళ్లైనప్పటికీ గ్లామర్‌కు మాత్రం క్రమంగా కొదవ ఇవ్వకుండా, మరింతగా హైలైట్ చేస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.
తాజాగా తన పుట్టిన రోజు (Anchor Sravanthi Birthday) సందర్భంగా గోవాలో ఫ్రెండ్స్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న స్రవంతి, ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైన్ తాగుతూ కేక్ కట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక తన గ్లామర్ షోతో అభిమానుల మతి పోగొడుతున్న స్రవంతిపై నెటిజన్లు “హీరోయిన్ మెటీరియల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.