Anchor Rashmi : యాంకర్ రష్మీకి సర్జరీ..ఎందుకంటే !
Anchor Rashmi : ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని , ఇంకా మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించినట్లు పేర్కొంది
- By Sudheer Published Date - 04:55 PM, Sun - 20 April 25

ప్రముఖ బుల్లితెర యాంకర్, నటిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam) ఇటీవల శస్త్ర చికిత్స (Surgery) చేయించుకున్న సంగతి తెలిసి ఆమె అభిమానులు ఆందోళన చెందారు. గత కొన్ని నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు ద్వారా తెలిపింది. జనవరి నెల నుంచే తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, అకస్మాత్తుగా హేమోగ్లోబిన్ లెవెల్స్ తొమ్మిది శాతానికి పడిపోయాయని , అలాగే అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డట్లు చెప్పుకొచ్చింది.
Wonderful : ఆకాశంలో అద్భుతం..ఆ నవ్వును అస్సలు మిస్ కావొద్దు
ఈ సమస్యల నేపథ్యంలో మార్చి నెల చివరినాటికి శరీరంగా పూర్తిగా నీరసించిపోయిందని, తన వర్క్ కమిట్‌మెంట్స్ అన్నింటినీ పూర్తి చేసుకుని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని రష్మీ పేర్కొన్నారు. చివరకు ఏప్రిల్ 18న ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారని తెలిపింది. చికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని , ఇంకా మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించినట్లు పేర్కొంది. తనకు ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన వైద్యులకి, కుటుంబ సభ్యులకు రష్మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. శస్త్రచికిత్సకు ముందు తీసిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారన్న సమాచారం అభిమానులకు ఊరటనిచ్చింది. త్వరలోనే తిరిగి పూర్తి ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్మీ సంకేతాలు ఇచ్చింది.