Pushpa : రంగమ్మత్తకు మించి.. పుష్పలో అనసూయ ఫస్ట్ లుక్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఆప్ డేట్ ఆసక్తిగా మారుతోంది. ఈ మూవీ మేకర్స్ అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
- Author : Balu J
Date : 10-11-2021 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఆప్ డేట్ ఆసక్తిగా మారుతోంది. ఈ మూవీ మేకర్స్ అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. దాక్షాయణిగా అనసూయ అదరగొట్టింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను పరిశీలిస్తే.. ఆమె క్యారెక్టర్ అహం, గర్వంతో కూడుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. రంగస్థలం చిత్రంలో చాలా డీగ్లామరస్‌గా కనిపించిన అనసూయ ఇప్పుడు పుష్ప సినిమాలోని దాక్షాయణి అనే పాత్ర కోసం మరింత డీ గ్లామర్ లుక్‌లో కనిపిస్తుంది. తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ కనిపించింది అనసూయ . ఆమె లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
She is arrogance and pride personified!
Introducing @anusuyakhasba as #Dakshayani.. #PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/ER87UhxXLZ
— Mythri Movie Makers (@MythriOfficial) November 10, 2021
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న కథానాయి. ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్‌లోని అడవుల్లో ఎర్రచందనం దోపిడీకి సంబంధించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించిన కొత్త పాట షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ గా చెప్పాడు. ‘‘తన అభిమానులను థియేటర్స్ వచ్చి సినిమా చూసి, తాను బాగా చేశానో లేదో సమీక్షించమని కోరాడు. నేను కూడా పాటలు విన్నాను, అన్నీ బ్లాక్‌బస్టర్స్. మరో రెండు పాటలు త్వరలో విడుదలవుతాయి. అందరికీ నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, నేను డిసెంబర్ 17 న పుష్పతో వస్తున్నాను, అక్కడ మిమ్మల్ని కలుస్తాను’’ అని అల్లు అర్జున్ అన్నాడు.