NTR’s Pathala Bhairavi: ఎన్టీఆర్ ని స్టార్ ని చేసిన ‘పాతాళ భైరవి’.. నేటికి 72 ఏళ్లు!
పరిస్థితులను ఎదిరించి కథానాయకుడు ఏదైనా సాధించగలడన్న ఫార్ములాకి పెద్ద పీట వేసింది 'పాతాళభైరవి'
- By Balu J Published Date - 11:08 AM, Wed - 15 March 23

ఎన్టీఆర్ (NTR) ని స్టార్ ని చేసిన సినిమా ‘పాతాళ భైరవి’. నేపాళ మాంత్రికునిగా ఎస్వీఆర్ అదరగొట్టారు. కేవీ రెడ్డి దర్శక నైపుణ్యం , విజయా సంస్థ నిర్మాణం, పింగళి పాటలు-మాటలు, ఘంటసాల సంగీతం, మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం ఈ చిత్రాన్ని క్లాసిక్ గా మార్చాయి. మంచి ప్రేమకథకు సాహసాన్ని మేళవించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు #KVReddy .
హీరోయిజం ఎలా ఉండాలో ‘పాతాళభైరవి’ (Pathala Bhairavi) లోని తోటరాముడు పాత్ర ఓ మైలురాయిగా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతకుముందు సినిమాల్లో అన్ని పాత్రల్లాగానే కథానాయకుడు కూడా పరిస్థితుల ప్రభావానికి లోనయ్యేవాడు. పరిస్థితులను ఎదిరించి కథానాయకుడు ఏదైనా సాధించగలడన్న ఫార్ములాకి పెద్ద పీట వేసింది ‘పాతాళభైరవి’ (Pathala Bhairavi). ఇప్పటికీ అదే ట్రెండ్ ని తెలుగు సినిమా అనుసరిస్తోంది.
భారీ వ్యయంతో కళాత్మక, సాంకేతిక విలువల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం తెలుగు నిర్మాణ సరళినే మార్చివేసింది. హీరో పాత్రలకు సూపర్ నేచురల్ పవర్స్ ఆపాదించి హీరోయిజం చూపించడం ఈ చిత్రంతోనే ఆరంభమైంది. దర్శకత్వ శాఖపై అభిలాష కలిగినవారు తప్పనిసరిగా అధ్యయనం, సూక్ష్మపరిశీలన చేయాల్సిన చిత్రాలలో ‘పాతాళభైరవి’ ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది. ఇప్పటికి ‘పాతాళభైరవి’ (Pathala Bhairavi) విడుదలై 72 ఏళ్లు. భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952 జనవరి 24వ మొదలయింది. అందులో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం ఇదే.
Also Read: BJP Telangana: బండి వ్యాఖ్యలతో బీజేపీ చీలిపోయిందా!

Related News

TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN
హైదరాబాద్ నడిబొడ్డున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకుంది. తెలుగోడి ఆత్మగౌరవ కోసం పుట్టింది. ఓ ప్రభంజనంలా తెలుగువాడి తట్టింది.