Shivangi Trailer : ఆనంది ‘శివంగి’ ట్రైలర్ రిలీజ్.. సత్యభామ రా..సవాల్ చేయకు..చంపేస్త..
ఇప్పటికే శివంగి సినిమా నుంచి ఓ మాస్ టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.
- By News Desk Published Date - 12:35 PM, Sat - 1 March 25

Shivangi Trailer : ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శివంగి. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మాణంలో పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ సినిమాగా శివంగి తెరకెక్కుతుంది. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే శివంగి సినిమా నుంచి ఓ మాస్ టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఒక గృహిణికి ఒకే రోజు 5 సమస్యలు రావడం, ఓ హత్య జరగడం, పోలీసులు ఆ గృహిణిని ప్రశ్నించడం జరుగుతుంది అన్నట్టు చూపించారు. మరి ఆ గృహిణికి వచ్చిన సమస్యలు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ లోనే ఆనంది తో మాస్ డైలాగ్స్ చెప్పించారు. ఇన్నాళ్ళు క్లాస్ పాత్రల్లో మెప్పించిన ఆనంద్ మొదటిసారి కాస్త మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ శివంగి సినిమా మార్చి 7న రిలీజ్ కానుంది.
Also Read : TS High Court : మల్టీప్లెక్స్ లలోకి పిల్లలు.. తీర్పుని సవరించిన తెలంగాణ హైకోర్టు..