Anand Devarakonda : కుర్ర హీరో సిక్స్ ప్యాక్ వెనక సీక్రెట్ అదేనా..?
Anand Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే ఓటీటీలో రిలీజైన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్
- By Ramesh Published Date - 02:40 PM, Mon - 20 May 24

Anand Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే ఓటీటీలో రిలీజైన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన బేబీ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ఈ నెల చివరన గం గం గణేశా సినిమాతో రాబోతున్నాడు. యూత్ ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆనంద్ లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక సిక్స్ ప్యాక్ ఫోటోతో షాక్ ఇచ్చాడు. ఆనన్ దేవరకొండ సిక్స్ ప్యాక్ చూసి ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆనంద్ ఎందుకు ఈ సిక్స్ ప్యాక్ చేసి ఉండొచ్చని ఆరా తీస్తున్నారు. అయితే ఆనంద్ నెక్స్ట్ సినిమా యాక్షన్ ప్రాజెక్ట్ గా రాబోతుందట.
ఆ సినిమాలో మాస్ హీరోగా ఆనంద్ కనిపిస్తాడని టాక్. అందుకే ఆనంద్ ఇలా వర్క్ అవుట్ చేసి తన మేకోవర్ చూపించాడు. ఆనంద్ సిక్స్ ప్యాక్ లుక్ రౌడీ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి పడినట్టుగా ఆనంద్ కూడా తన సొంతంగా ఒక సోలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. బేబీ హిట్ అయినా అది డైరెక్టర్, హీరోయిన్ సగం మార్కులు కొట్టేశారు. ఆనంద్ కూడా సాలిడ్ హిట్ కొడితే రౌడీ ఫ్యాన్స్ అతన్ని కూడా స్టార్ ని చేసేందుకు రెడీగా ఉన్నారు.
ఆనంద్ దేవరకొండ గం గం గణేశా తర్వాత ఏ సినిమాతో చేస్తాడు. అందులో ఆనంద్ ఎలా కనిపిస్తాడు అన్నది త్వరలో తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం ఆనంద్ సిక్స్ ప్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Trisha : 5 కోట్లు ఇస్తేనే సినిమా అంటున్న స్టార్ హీరోయిన్..?