Amul Tribute PS1: పొన్నియిన్ సెల్వన్ క్రేజ్.. అమూల్ డూడుల్ పిక్స్ అదుర్స్!
మణిరత్నం దర్శకత్వం వహించిన ఎపిక్ పీరియడ్ యాక్షన్-డ్రామా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల మనసును దోచింది.
- Author : Balu J
Date : 03-10-2022 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
మణిరత్నం దర్శకత్వం వహించిన ఎపిక్ పీరియడ్ యాక్షన్-డ్రామా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల మనసును దోచింది. అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తాజాగా అమూల్ డెయిరీ కంపెనీ యానిమేటెడ్ డూడుల్‌తో పొన్నియిన్ సెల్వన్ ను అప్రిషియేట్ చేస్తూ.. రిచ్ ట్రిబ్యూట్ ఇచ్చింది.
అమూల్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవల పోస్ట్‌లో, విక్రమ్, ఐశ్వర్య, త్రిష, కార్తీ వెన్నతో ముంచిన రొట్టె ముక్కను ఆస్వాదిస్తున్న యానిమేటెడ్ చిత్రాన్ని షేర్ చేసింది. “మీ మణి విలువను పొందండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ చిత్రం చోళ రాజవంశం ఆవిర్భావాన్ని వివరిస్తూ అదే పేరుతో కల్కి కృష్ణమూర్తి ఐదు భాగాల నవల ఆధారంగా తెరెక్కింది. ఒకవైపు ఐశ్వర్యారాయ్, మరోవైపు త్రిష అభినయం, అందం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ చేయబడిన PS-1 ఇప్పుడు దేశవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. మిగతా భాషల్లో పోలిస్తే తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ సందడి చేస్తోంది.
#Amul Topical: Epic film, by Mani Ratnam, Ponniyin Selvan released! pic.twitter.com/ftbyqYk6Bn
— Amul.coop (@Amul_Coop) October 2, 2022