HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Amitabh Bachchan Shelve Movie With Kamal Haasan

Kamal Haasan : తనకంటే కమల్ హాసన్ పాత్ర ఎక్కువ హైలెట్ అవుతుందని.. సినిమా ఆపేసిన అమితాబ్..

1984లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘ఖబడ్ధార్’ అనే సినిమా మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ తో యమగోల వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన తాతనేని రామారావు ఈ ఖబర్దార్ సినిమాకి దర్శకత్వం వహించారు.

  • Author : News Desk Date : 03-07-2023 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amitabh Bachchan shelve movie with Kamal Haasan
Amitabh Bachchan shelve movie with Kamal Haasan

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు రాసుకున్న పాత్రకి తన నటనతో ప్రాణం పోసి ప్రేక్షకుల గుండెల్లో ఆ పాత్రని ఎన్నో ఏళ్లు జీవించేలా చేస్తాడు. మరి అంతటి గొప్ప నటుడిని చూస్తే ఎవరికైనా కొంచమైనా ఈర్ష కలగడం సహజం. అలా కమల్ ని చూసి బాలీవుడ్(Bollywood) బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కి కూడా కొసరంత ఈర్ష కలిగిందట. దానివల్లే మొదలుపెట్టి చాలా భాగం షూటింగ్ జరిపిన ఒక సినిమాని అర్దాంతరంగా ఆపేశాడట. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్(K Bhagyaraj) ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

1984లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘ఖబడ్ధార్’ అనే సినిమా మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ తో యమగోల వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన తాతనేని రామారావు ఈ ఖబర్దార్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమితాబచ్చన్ డాక్టర్ గా నటించాడు. ఇక కమల్ హాసన్ ఒక మెంటల్లీ చాలెంజ్డ్ పేషంట్ లా నటించాడు. ఈ మూవీ మొదలయ్యి దాదాపు సగం పైనే షూటింగ్ జరుపుకుంది. అయితే సడన్ గా ఆ మూవీని నిలిపివేశారు. అప్పట్లో అసలు కారణమేంటో తెలియకుండానే మిగిలిపోయింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా ఆగిపోవడానికి కారణం అమితాబ్ బచ్చన్ కి కలిగిన ఈర్షే అంటూ భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో అమితాబ్ పాత్ర కంటే కమల్ పాత్ర ఎక్కువ హైలెట్ అవుతుందట. అందువలనే అమితాబ్ ఆ సినిమాని మధ్యలోనే ఆపేసినట్లు భాగ్యరాజ్ తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాతి సంవత్సరంలోనే అమితాబ్ అండ్ కమల్.. అన్నదమ్ములుగా నటిస్తూ ‘గెరాఫ్తార్‌’ సినిమాలో కనిపించారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయడం మరో విశేషం. ఆ సినిమా తర్వాత అమితాబ్ బచ్చన్, కమలహాసన్ మళ్లీ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ కలిసి ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్నారు.

 

Tollywood : ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో కనిపెట్టారో..? మొదటి సినిమాకే బెస్ట్ యాక్టర్ అవార్డు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amitabh bachchan
  • bollywood
  • k Bhagyaraja
  • Kamal Haasan
  • Tathineni Ramarao

Related News

Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

తన దరఖాస్తులో, ‘నిష్పక్షపాత విచారణ మరియు తదుపరి న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, కొనసాగుతున్న విచారణను ఎదుర్కొని, న్యాయపరమైన విచారణ ప్రక్రియలో చేరడానికి’ తాను స్వచ్ఛందంగా కోర్టుకు లొంగిపోవాలనుకుంటున్నట్లు అన్మోల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్, ‘నిష్పక్షపాత విచారణ మరియు న్యాయం కోసం’ విచారణ ప్రక్రియలో పాల్గొన

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd