Amitabh Bachchan : డూప్లెక్స్ అపార్ట్మెంట్ ను అమ్మేసిన బిగ్ బి
Amitabh Bachchan : అట్లాంటిస్ బిల్డింగ్‌లో ఉన్న 5వేల చదరపు అడుగుల ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ను 2021 ఏప్రిల్లో రూ. 31కోట్లకు కొనుగోలు చేసారు
- Author : Sudheer
Date : 21-01-2025 - 5:51 IST
Published By : Hashtagu Telugu Desk
బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముంబై ఓషివారాలోని తన డూప్లెక్స్ అపార్ట్మెంట్ను రూ. 83కోట్లకు అమ్మేశారు. అట్లాంటిస్ బిల్డింగ్‌లో ఉన్న 5వేల చదరపు అడుగుల ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ను 2021 ఏప్రిల్లో రూ. 31కోట్లకు కొనుగోలు చేసారు. ఇక నవంబర్లో హీరోయిన్ కృతి సనన్ కు నెలకు రూ. 10లక్షలకు రెంట్కు ఇచ్చారు. అపార్ట్‌మెంట్ సేల్‌లో స్టాంప్ డ్యూటీనే రూ.4.98 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000 చెల్లించాడు బిగ్ బీ.
IT Raids : దిల్ రాజు భార్యను బ్యాంకుకు ఎందుకు తీసుకెళ్లినట్లు..?
ఇక ఈ అపార్ట్‌మెంట్‌ను అమ్మితే బిగ్ బి కి 168 శాతం లాభం అందిండడం విశేషం.ఈ అపార్ట్‌మెంట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్‌లు కొన్నారు. 2020 నుంచి 2024 వరకు బచ్చన్ ఫామిలీకి రియల్ ఎస్టేట్‌లో బాగా లాభాలు వచ్చాయి. దాదాపు రూ.200 కోట్ల వరకు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటిలో చాలా వరకు ముంబై సిటీతోపాటు చుట్టు పక్కల ఉన్నాయి. ఇక ఇప్పుడు డూప్లెక్స్ అపార్ట్మెంట్నుఅమ్మడం , భారీ లాభాలు అందడంతో సినీ లవర్స్ మరోసారి బిగ్ బి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం బిగ్ బి సినిమాలు చేయడం తగ్గించిన బుల్లితెరపై పలు షోస్ చేస్తూ అలరిస్తున్నాడు. ఆ మధ్య ప్రభాస్ తో కలిసి కల్కి మూవీ లో నటించి సినిమాకే హైలైట్ అయ్యారు.