HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Amigos Will Not Disappoint Us Kalyan Ram

Kalyan Ram: నేను ఎవరిని బెదిరించను.. ఐ జస్ట్ కిల్!

ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  

  • Author : Balu J Date : 04-02-2023 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amigos
Amigos

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Kalyan Ram) త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’ (Amigos).  రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Kalyan Ram), నిర్మాత య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ (Ravi Shankar) మాట్లాడుతూ ‘‘కర్నూలు లో మేం నిర్వహిస్తోన్న మూడో ఈవెంట్ ఇది. క‌ర్నూలు మాకు చాలా సెంటిమెంట్‌గా మారింది. క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్‌గారు చ‌నిపోవ‌టం చాలా బాధాక‌రం. వారి ఫ్యామిలీకి మా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసుకుంటున్నాను. ‘ఉయ్ మిస్ యు విశ్వ‌నాథ్‌గారు.మీరు శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం వంటి అద్భుత‌మైన సినిమాల‌ను ఇచ్చారు. జీవిత కాలంలో వాటిని అస్స‌లు మ‌ర‌చిపోలేం’.  ఈవెంట్‌ను నిర్వ‌హించాలా..వ‌ద్దా? అని కూడా ఆలోచించాం. కానీ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తై చాలా దూరం రావ‌టంతో ఈవెంట్‌ను నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. అమిగోస్ సినిమా విషయానికి వస్తే సినిమాను మేం చూశాం. ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. రాజేంద‌ర్ రెడ్డి తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ అత్య‌ద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. సౌంద‌ర్ రాజ‌న్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. క‌ళ్యాణ్ రామ్‌గారి పెర్ఫామెన్స్ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ చ‌క్క‌గా న‌టించింది. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ (Friends) అని అర్థం. ఒకేలా మూడు వేర్వేరు ప్రాంతాల్లోని ఫ్రెండ్స్ ఒక‌చోట క‌లిసిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేది సినిమా క‌థ‌. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా ఉంటుంది. ఫ‌స్టాఫ్ చాలా బావుంది. సెకండాఫ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సినిమాను ఆసాంతం ఆస్వాదిస్తారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌గారిని క‌లిశాం. ఆయ‌న క‌ర్నూలులోని ఫ్యాన్స్  ఇచ్చే ట్రీట్‌మెంట్ గురించి చెప్పారు. ఆయ‌న చెప్పిన దాని కంటే ప‌ది రెట్టు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అభిమానుల‌కు థాంక్స్‌’’ అన్నారు.

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) మాట్లాడుతూ ‘‘2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ సినిమాకు మీరు చూపించిన ఆద‌రాభిమానాలు చూసి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. కొత్త సినిమాల‌ను చేసిన ప్ర‌తీసారి ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే వ‌చ్చారు. అలాగే అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. తాత‌గారు రాముడు భీముడు (Ramudu Bheemudu) చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. త‌ర్వాత  త‌మ్ముడు జై ల‌వ‌కుశ చేశాడు. ఇవ‌న్నీ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌థ‌. అయితే అమిగోస్ మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురుంటార‌ని తెలుసు. అలాంటి ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. థియేట‌ర్‌లో మీరు డిస‌ప్పాయింట్ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూప‌ర్ హిట్ (Super Hit) సినిమా రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి 10న మూవీ మీ ముందుకు రానుంది. ఎల్లుండి జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త‌మ్ముడు గెస్ట్‌గా వ‌స్తున్నాడు. జై ఎన్టీఆర్‌, జై హ‌రికృష్ణ‌, జై హింద్‌’’ అన్నారు.

Also Read: Anil Kumar Singhal: గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ సింఘాల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amigos
  • kalyan ram
  • latest tollywood news
  • trailer released

Related News

Grand Launch of Venky-Kalyan Ram Multi-starrer Anil Ravipudi: Venky and Kalyan Ram in Anil Ravipudi's Multi-starrer

Venkatesh Kalyan Ram: అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్

టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తి రేపుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి ఈరోజు అధికారికంగా అంకురార్పణ జరిగింది. విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ వంటి సినీ ప్రమ

    Latest News

    • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd