HHVM : వీరమల్లు హిట్ అవ్వాలని కోరుకున్న అంబటి..నిజమా..లేక సెటైరా ?
HHVM : 'పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్టై, కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను' అని Xలో రాసుకొచ్చారు. దీనికి పవన్, నాగబాబును ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైరేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
- By Sudheer Published Date - 11:25 AM, Wed - 23 July 25

తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు (Hariharaveeramallu) హావ నడుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమైంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం దయాకర్ రావు నిర్మించగా, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో రూపొందింది. దయాకర్ రావు నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ కలిసి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోస్ , ఈరోజు అర్ధరాత్రి నుండే ప్రీమియర్ షోస్ మొదలుకాబోతున్నాయి. సినిమా సూపర్ హిట్ కావాలని అభిమానులు, జనసేన శ్రేణులు , సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు సైతం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని పోస్ట్ లు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Dhankhar To QUIT : జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తరచూ విమర్శలు గుప్పించే మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్టై, కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని Xలో రాసుకొచ్చారు. దీనికి పవన్, నాగబాబును ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైరేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాంబాబు కు ఇలాంటి సెటైర్లు వేయడం కొత్తమీ కాదని , నిజంగా ఆయన ఆలా కోరుకోవడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి రాంబాబు ట్వీట్ అనేది సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
పవన్ కళ్యాణ్ గారి
“హరిహర వీర మల్లు”
సూపర్ డూపర్ హిట్టై
కనక వర్షం కురవాలని
కోరుకుంటున్నాను !@PawanKalyan @NagaBabuOffl— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2025
ఇదిలా ఉంటె ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు వైజాగ్‌లోను గ్రాండ్‌గా ఓ కార్యక్రమం జరపనుంది. వైజాగ్‌లోని బీచ్ రోడ్ వద్ద ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం 4గం.లకి ఈవెంట్ ప్రారంభం కానుండగా, కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరు కానుంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. తొలుత తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల లొకేషన్ మార్చారు. ఈవెంట్‌కి పవన్ అభిమానులు, జనసైనికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, మేకర్స్ అన్నీ ఏర్పాట్లు జాగ్రత్తగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండటంతో, ఆయన సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. అందుకే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.