Sneha Reddy : గ్లామర్, ఫ్యాషన్, ట్రెడిషనల్.. దేంట్లోనూ తగ్గేదేలే!
టాలీవుడ్ లో హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘ట్రెండ్ ఫాలోకావడం కాదు.. ట్రెండ్ క్రియేట్ చేద్దాం’ అనే డైలాగ్ ఈ స్టయిలిష్ స్టార్ కు అతికినట్టుగా సరిపోతోంది.
- By Balu J Published Date - 10:59 AM, Mon - 15 November 21

టాలీవుడ్ లో హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘ట్రెండ్ ఫాలోకావడం కాదు.. ట్రెండ్ క్రియేట్ చేద్దాం’ అనే డైలాగ్ ఈ స్టయిలిష్ స్టార్ కు అతికినట్టుగా సరిపోతోంది. డ్రెస్సింగ్ లోనూ, ఫ్యాషన్ సెన్స్ లోనూ అల్లును మించినవారు ఉండరని చెప్పక తప్పదు.
అయితే అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా ఫ్యాషన్ కు పర్యాయపదంగా మారుతోంది. పేరుకు అల్లు గారి కోడలు అయినా ఫ్యాషన్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తన క్యాస్ట్యూమ్స్ తో అదరగొడుతోంది.
రీసెంట్ గా స్నేహరెడ్డి ధరించిన చీరలు చాలామందిని ఆకట్టుకున్నాయి. ఆమె చీరలను ఎవరు డిజైన్ చేసారబ్బా.. అంటూ గుగూల్ కూడా చేశారు. రీసెంట్ గా ఓ టూరుకు వెళ్లిన స్నేహరెడ్డిలు ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. దానికి కారణం ఆమె ధరించిన చీరలు. అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన డీప్ ఫారెస్ట్ గ్రీన్ కలర్ చీర ధరించి కనిపించింది. ఈ స్పెషల్ కాస్ట్యూమ్ కోసం దాదాపు 1.75 లక్షల వరకు ఖర్చయిందట. ఇక సమంత స్టైలిష్ట్, డిజైనర్గా ప్రీతమ్ వెరైటీ వెరైటీ దుస్తులను క్రియేట్ చేస్తుంటాడట. ఇక అల్లు స్నేహారెడ్డికి కూడా ప్రీతమ్ స్టైలిష్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీపావళికి ప్రీతమ్ రెడీ చేసిన డ్రెస్‌లో అల్లు స్నేహారెడ్డి అదిరిపోయింది.
Related News

Allu Arjun: తగ్గేదేలే.. అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా, 200 కోట్ల భారీ బడ్జెట్ తో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పుష్ప2 తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.