Prabhas- Allu Arjun Fans Fight : ప్రభాస్ ఫ్యాన్ ను రక్తం వచ్చేలా కొట్టిన బన్నీ ఫ్యాన్స్ ..ఏరా మీరు మారరా..?
- By Sudheer Published Date - 12:33 PM, Mon - 11 March 24

అభిమానం (Fondness ) పేరుతో కొంతమంది హీరోల అభిమానులు రెచ్చిపోతున్నారు. మా హీరో ను ఎగతాళి చేస్తావా..? అని కొందరు..? మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ మరికొందరు..? మా హీరో రికార్డ్స్ బ్రేక్ చేస్తాడంటే మా హీరో అంటూ ఇంకొందరు..? ఇలా అనేక రకాలుగా అభిమానులు..ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ కొట్లాట వరకు వెళ్తున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ – ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఎంత కొట్లాటలు జరిగాయో తెలియంది కాదు..అరే మీమంతా బాగానే ఉన్నాం..కలిసి తిరుగుతున్నాం..పార్టీ లు చేసుకుంటున్నాము..మాకు లేని ఇగో ఫీలింగ్ మీకెందుకు ..మాకోసం మీరెందుకు గొడవ పడుతున్నారు అంటూ అనేక వేదిక ఫై హీరోలు చెపుతున్నప్పటికీ అభిమానులు మాత్రం మారడం లేదు. అనేక చోట్ల అభిమానం పేరుతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా బెంగుళూర్ (Bengaluru) లో ప్రభాస్ ఫ్యాన్ (Prabhas Fans) ని..అల్లు అర్జున్ అభిమానులు (Allu Arjun) రక్తం వచ్చేలా కొట్టిన ఘటన ఇప్పుడు మీడియా లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌ను కొంతమంది బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. విచక్షణా రహితంగా ఒక్కడిని చేసి చితకబాదిన ఆ పది మందిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. దీని మీద పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఆ పది మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేసారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. మరి వీరి మధ్య ఎందుకు గొడవ వచ్చిందో తెలియాల్సి ఉంది. కారణం ఏదైనా ఇలా అభిమానం పేరుతో గొడవలు చేసుకోవడం , కొట్లాడుకోవడం మంచిది కాదని అంటున్నారు నెటిజన్లు.
. @BlrCityPolice you should take action on this kind of people, just for online far wars this is not acceptable, kindly take proper action. pic.twitter.com/kfn4GlxmiO
— J3👦 (@Jack_JackParr) March 10, 2024
Read Also : Brother Anil : జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన బ్రదర్ అనిల్