Allu Arjun Desamuduru: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేశముదురు రీరిలీజ్!
ఇటీవలనే చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
- By Balu J Published Date - 03:06 PM, Thu - 30 March 23

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో బన్నీ మార్కెట్ వ్యాల్యూ కూడా అమాంతంగా పెరిగింది. ఇప్పటికే టాలీవుడ్, కన్నడలో మంచి ఫాలోయింగ్ బన్నీకి బాలీవుడ్ లోనూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ పుట్టుకొస్తున్నారు. ఇక ఇటీవలనే చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ మరో సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అభిమానులకు న బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటైన “దేశముదురు” రీరిలీజ్ చేసి కానుక ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 6న మళ్లీ గ్రాండ్ గా విడుదల కానుంది. పాత చిత్రాలను మళ్లీ విడుదల చేయడం టాలీవుడ్ లో ఆనవాయితీగా మారింది. ఐకానిక్ యాక్షన్ ఫిల్మ్‌ను పెద్ద స్క్రీన్‌లపై చూసే అవకాశం రావడంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. పూరి టేకింగ్, అల్లు అర్జున్ హైపర్ యాక్షన్, హన్సికా అందాలు ఈ సినిమాలో ప్రత్యేకార్షణగా నిలిచాయి.
2007 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఒకటి గా నిలిచింది. దేశముదురు 4K వెర్షన్ లో విడుదల కాబోతోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మొదటి భాగం భారీ విజయంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజా నివేదికల ప్రకారం ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి కూడా నటిస్తున్నారు.
Also Read: Dasara Review: నాని నట విశ్వరూపం.. దసరా మూవీ దుమ్మురేపిందా!