Dasara Review: నాని నట విశ్వరూపం.. దసరా మూవీ దుమ్మురేపిందా!
- By Balu J Published Date - 01:19 PM, Thu - 30 March 23
టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని (Nani), మహానటి ఫేం కీర్తి సురేశ్ కలయికలో రూపుదిద్దుకున్న దసరా మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటిసారి నాని పాన్ ఇండియా సినిమా చేయడం, ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ సింగరేణి నేపథ్యంలో సినిమా తెరకెక్కడం, ఈ మూవీ ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కావడం లాంటి అంశాలు దసరా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని మాస్ అవతార్ లో అదరగొట్టాడా? కీర్తి సురేష్ వెన్నెలగా మెప్పించిందా అంటే ముందుగా ఈ సినిమా స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో నాని( Nani ) ధరణి అనే పాత్రలో కనిపిస్తాడు. ఇక ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఇలా ప్రతిరోజు అతని లైఫ్ సాగుతూ ఉంటుంది. అయితే ఓసారి చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్ లో కూడా గొడవపడి మర్చిపోతాడు. కానీ చిన్న నంబి మాత్రం ఆ గొడవను అస్సలు మర్చిపోడు. దానిని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అలా ధరణి చేసిన పొరపాటు వల్ల ఆయన ప్రియురాలు వెన్నెల (కీర్తి సురేష్)( Keerthy Suresh ), అతని స్నేహితులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో వారిని కాపాడటం కోసం ధరణి ఏం చేస్తాడు అన్నది. చివరికి ధరణి ఎలా మారుతాడు అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్
నటి నటుల నటన విషయాలు చూస్తే నాని నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ పాత్రకైనా నాని అదరగొట్టేస్తాడు. ఇక ఈ సినిమాలో ధరణి పాత్రతో మాత్రం పూర్తిగా మార్కులు కొట్టేశాడు. అందులో ఆయన భాష, లుక్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ఇక వెన్నెలగా కీర్తి సురేష్ నటించింది. తన లుక్ తో, మాటలతో బాగా ఆకట్టుకుంది. ఇక దీక్షిత్ శెట్టి కూడా నాని స్నేహితుడిగా బాగా నటించాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా నెగటివ్ పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు. మిగతా నటినటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీకాంత్ (Srikanth Odela) ఓదెల ఈ సినిమాకు మంచి కథలు అందించాడు.ఎమోషనల్, యాక్షన్స్, మంచి మంచి ఎలివేషన్లు బాగా చూపించాడు. సత్యం సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి. మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
మైనస్ పాయింట్స్
ఈ సినిమాలో నాని మాస్ అవతార్ లో ఆకట్టుకున్నప్పటికీ, ఆ గెటప్ ఎందుకు వేసుకున్నాడనేది సగటు ప్రేక్షకుడి మదిలో ప్రశ్న. గొప్ప స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ డైరెక్టర్ బాగా ఉపయోగించుకోలేకపోయాడని చెప్పొచ్చు. ఇక పాటలు కూడా ఎప్పుడు వస్తాయో కూడా అర్థం కాదు. హీరో పాత్ర కన్నా స్నేహితుడి పాత్రకు ఎక్కువ హైప్ ఇచ్చినట్టుంది. ఫస్టాఫ్ గొప్పగా ఉన్నా.. సెకాండఫ్ లో ఎమోషన్స్ మిస్ అయ్యాయి.
సినిమా ఎలా ఉందంటే..
తెలంగాణ బొగ్గు గనుల నేపథ్యం( Coal Mines )లో ఈ సినిమా కథను ప్రతి ఒక్కరికి మనసుకు తాకే విధంగా చూపించాడు డైరెక్టర్. ఇక ఫస్ట్ ఆఫ్ లో కామెడీ, యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.ఇక ఇంటర్నెట్ ట్విస్ట్ మామూలుగా ఉండదని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాను మంచి ఎమోషనల్, యాక్షన్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. అయితే ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలను చూసిన తెలుగు ప్రేక్షకులు నాని నుంచి అలాంటి సినిమాను ఆశించారు. అయితే ఆ స్థాయి సినిమా కాకపోయినా నాని దసరా మూవీ కచ్చితంగా చూడాల్సిన సినిమా అనే చెప్పవచ్చు. డిఫరెంట్ షేడ్స్ తో రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో నాని అద్భుతంగా నటించాడు. అలాగే నేపథ్యం, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే కథనంలో కొన్నిచోట్ల ఆసక్తి పెంచే అంశాలు ఆశించిన స్థాయిలో కుదరలేదు. ఓవరాల్ గా ఈ సినిమా నాని ఫ్యాన్స్ తో ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తోంది.
Related News
Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ గ్లామర్.. డోస్ పెంచిన మహానటి..!
Keerthy Suresh మహానటి కీర్తి సురేష్ సౌత్ నుంచి అలా బాలీవుడ్ వెళ్లిందో లేదో గ్లామర్ డోస్ పెంచేసింది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది