Sneha Reddy : స్నేహా రెడ్డి తిరుమల దర్శనాల వెనుక కారణం ఏంటో..?
- By Sudheer Published Date - 03:52 PM, Wed - 31 January 24

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Wife Sneha Reddy ) భార్య స్నేహా రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ కు సంబదించిన విషయాలతో పాటు పిల్లలకు సంబదించిన వీడియోస్ , పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లను , అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతే కాదు ఆమెకు సంబదించిన ఫోటోషూట్స్ ను సైతం పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఈమె తరుచు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటుండడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది.
ప్రపంచంలోనే ఎక్కువమంది విజిట్ చేసే హిందూ దేవాలయం తిరుమల. ఏడాది పొడుగూతా భక్తుల తాకిడి ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి వెంకన్నను దర్శనం చేసుకుంటారు.. సినీ ఇండస్ట్రీ నుండి కూడా చాలామంది సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా తిరుమల కి ప్రతిసారి వస్తూ ఉంటుంది.. అయితే ఈ మధ్య స్నేహ రెడ్డి తరుచు రావడం ఏంటి అని అంత ఆరా తీస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గానే తన కూతురు అల్లు అర్హతో తిరుమలలో స్నేహ రెడ్డి కనిపించింది.కానీ కూతురితో కలిసి వెళ్ళిన కొద్ది రోజులకే మళ్ళీ స్నేహ రెడ్డి తిరుమల వెళ్ళింది. మాములుగా ఎవరైనా కూడా ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వెళ్తారు.. కానీ ఈమె ఇలా వరుస ఎందుకు వెళ్తుంది అనే సందేహాలు కూడా జనాలకు వస్తుంది.. అయితే స్నేహా రెడ్డి ఒక్కటే తిరుమలకు వెళ్లడం ఏంటి? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఏదో బలమైన కొరికే స్నేహ కోరినట్లు ఉంది..అందుకే ఆ కోరిక నెరవేరాలని చెప్పి ఇలా తరుచు వెంకన్నను దర్శనం చేసుకుంటుంది కావొచ్చని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Prabhas : సినిమాలకు ప్రభాస్ బ్రేక్..ఎందుకంటే..!!