Allu Arjun Humanity: ఐకాన్ స్టార్ మానవత్వం.. కేరళ విద్యార్థికి అల్లు అర్జున్ సాయం!
కేరళలో అల్లు అర్జున్ కి చాలామంది అభిమానులున్నారు. కేరళ ప్రజలన్నా ఐకాన్ స్టార్ కి అంతే అభిమానం. ఆ అభిమానంతోనే ఓ కేరళ
- By Balu J Published Date - 02:57 PM, Sat - 12 November 22
కేరళలో అల్లు అర్జున్ కి చాలామంది అభిమానులున్నారు. కేరళ ప్రజలన్నా ఐకాన్ స్టార్ కి అంతే అభిమానం. ఆ అభిమానంతోనే ఓ కేరళ అమ్మాయిని దత్తత తీసుకున్నారు అల్లు అర్జున్. ఆమె చదువు పూర్తయ్యే వరకు అయ్యే మొత్తం ఖర్చుని తానే భరిస్తానని చెప్పారు. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకోసం అలెప్పి కలెక్టర్ కృష్ణతేజ వుయ్ ఆర్ ఫర్ అలెప్పి అనే కార్యక్రమం ప్రారంభించారు. అందులో అల్లు అర్జున్ భాగస్వామ్యం కూడా ఉంది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ అమ్మాయి నర్సింగ్ కోర్స్ పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకున్న కలెక్టర్ ఒక ఏడాది ఫీజు చెల్లించాలని అల్లు అర్జున్ ని కోరారు.
అయితే అల్లు అర్జున్ మాత్రం మొత్తం నాలుగేళ్లు తానే ఫీజు చెల్లిస్తానన్నారు. ఆమెను తాను దత్తత తీసుకుంటాని తెలిపారు. తాను కోరిన వెంటనే నర్సింగ్ విద్యార్థి చదువు బాధ్యతలు తీసుకున్న అల్లు అర్జున్ కి అలెప్పి జిల్లా కలెక్టర్ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు. ఆ అమ్మాయి చదువుల్లో ఫస్ట్ అని, కానీ కరోనా వల్ల తండ్రిని కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని, ఇలాంటి సమయంలో ఆమెకు అల్లు అర్జున్ అండగా నిలవడం నిజంగా గొప్ప విషయం అని అన్నారు కలెక్టర్ తెలిపారు.
Related News
Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!
Pushpa 2 పుష్ప 2 నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.