Allu Arjun : ఆక్సిడెంట్ గురించి చెప్పి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
Allu Arjun : గతంలో తనకు జరిగిన యాక్సిడెంట్ (Accident) గురించి తెలిపాడు. "నా పదవ సినిమా తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది. భుజానికి గాయం అయ్యింది
- By Sudheer Published Date - 10:00 PM, Thu - 1 May 25

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. ముంబైలో జరిగిన ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (Waves Summit 2025 ) లో పాల్గొన్న అల్లు అర్జున్, గతంలో తనకు జరిగిన యాక్సిడెంట్ (Accident) గురించి తెలిపాడు. “నా పదవ సినిమా తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది. భుజానికి గాయం అయ్యింది. అంతకు ముందు ఒక చిన్న సర్జరీ జరగడం తో మూడు వారాల రెస్ట్ తీసుకున్నాను. ఈసారి కూడా అలాగే అనుకున్నాను. కానీ డాక్టర్ 6 నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు” అంటూ తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మాటలు విన్నవారంతా షాక్ అయ్యారు.
ఆ ఘటన తన జీవితాన్ని, దాని విలువను అర్థం చేసుకునేలా చేసిందని అల్లు అర్జున్ చెప్పారు. “ఆ సమయంలో భయపడ్డాను. నా 11వ సినిమా షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. కానీ ఈ అనూహ్య పరిస్థితి నాకు పెద్ద శిక్షగా అనిపించింది. అదే సమయంలో నా ఆరోగ్యం, నటన, ప్రతి సీన్ మీద మరింతగా శ్రద్ధ పెట్టడం ప్రారంభించాను” అంటూ చెప్పుకొచ్చారు. తన యాక్సిడెంట్ జీవితాన్ని మలుపుతిప్పిందని, ఆ తర్వాత నటనపై మరియు ఫిట్‌నెస్‌పై తన దృష్టి మరింత పెరిగిందని వెల్లడించారు.
రీసెంట్ గా అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి రూపొందించిన ఈ చిత్రం భారతదేశ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రూ.1870 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో విశేషమైన రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.