Allu Arjun Remuneration : అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.300 కోట్లా..?
Allu Arjun Remuneration : 'పుష్ప-2' క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లు అర్జున్ రూ.300కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది
- By Sudheer Published Date - 03:33 PM, Fri - 15 November 24

అల్లు అర్జున్ (Allu Arjun )..ఈ పేరు వింటే చాలు తగ్గేదేలే అని అంటారు. గంగోత్రి మూవీ తో వెండితెరకి పరిచమై..ఆర్య తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. డాన్స్ , స్టయిల్ , యాక్టింగ్ ఇలా అన్నింట్లో తనదైన శైలిని చూపిస్తూ యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక సుకుమార్ డైరెక్షన్లో చేసిన పుష్ప మూవీ ఆయన్ను పాన్ ఇండియా స్టార్ చేయడమే కాదు నేషనల్ అవార్డు వచ్చేలా చేసింది. ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వెల్ పుష్ప 2 (Pushpa 2) తో డిసెంబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా తాలూకా విశేషాలు సినిమా పై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ (allu arjun remuneration for pushpa part 2) ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. పుష్ప-2′ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లు అర్జున్ రూ.300కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇది షారుఖ్, దళపతి విజయ్, ప్రభాస్ తీసుకుంటున్న దానికంటే ఎక్కువని తెలిపింది. దీంతో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న యాక్టర్ గా ఐకాన్ స్టార్ నిలిచారని పేర్కొంది. ఈ వార్త చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం భారీ ప్రమోషన్‌ను ప్లాన్ చేసింది. ముఖ్యంగా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. బిహార్ లోని పాట్నాలో భారీ వేదికను నిర్మించి వేలాది మంది అభిమానుల సమక్షంలో నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
Read Also : AP Assembly Sessions : జగన్ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసాడు – సీఎం చంద్రబాబు