Pushpa 2 : సంచలనం సృష్టిస్తున్న పుష్ప పుష్ప సాంగ్.. ఇక సెకండ్ సింగల్‌తో..
యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న పుష్ప పుష్ప సాంగ్. మొదటి పాటే ఇలా ఉంటే, ఇక సెకండ్ సింగల్..
- By News Desk Published Date - 07:18 PM, Tue - 28 May 24

Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న ‘పుష్ప 2’ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన ఆల్బం పాన్ ఇండియన్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసాయి. దీంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్లే దేవిశ్రీ కూడా మ్యూజిక్ ని ప్రిపేర్ చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని, మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డాన్స్ స్టెప్పులు అయితే ట్రెండ్ సెట్ చేసాయి. దీంతో యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్, లైక్స్ సంపాదించుకుంది. తాజాగా ఈ సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్, 2.26 మిలియన్స్ లైక్స్ సంపాదించి అదుర్స్ అనిపించింది.
ఇక మొదటి సాంగ్ ఇంతటి హిట్ అవ్వడంతో.. సెకండ్ సింగల్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనే ఆసక్తి మొదలయింది. సెకండ్ సింగల్ గా మూవీ నుంచి లవ్ సాంగ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రేపు మే 29న ఈ మూవీ నుంచి సెకండ్ సింగల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ‘సూసేకి’ అంటూ సాగే ఈ సాంగ్.. ఫస్ట్ పార్ట్ లోని ‘సామీ సామీ’ సాంగ్ ని మైమరపిస్తుందని చెబుతున్నారు.
కాగా ఈ సినిమా ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, రావు రమేష్, ధనుజయ్, తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ చేస్తున్నట్లు సమాచారం.