Pushpa 2 : జనసేనని బాగానే ప్రమోట్ చేస్తున్న పుష్ప.. గాజు గ్లాస్‌తో స్టెప్..
జనసేనని బాగానే ప్రమోట్ చేస్తున్న పుష్ప. గాజు గ్లాస్‌తో అల్లు అర్జున్ వేసిన స్టెప్ నెట్టింట వైరల్ గా మారింది.
- By News Desk Published Date - 06:57 PM, Wed - 1 May 24

Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ క్యాచీ ట్యూన్‌తో, పవర్ ఫుల్ లిరిక్స్ తో సాంగ్ అదిరిపోయింది. ఇక ఆ పాటకి అల్లు అర్జున్ స్వాగ్ అండ్ డాన్స్ స్టెప్స్ తోడై మరింత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటని ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డిజైన్ తో విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మ కోరియోగ్రఫీ చేసారు. సాంగ్ మొత్తంలో మూడు హుక్ స్టెప్స్ ని డిజైన్ చేసారు.
చెప్పు జారిపోయే కొత్త స్టెప్, ఫోన్ స్టెప్, గాజు గ్లాస్ స్టెప్.. ఈ మూడు స్టెప్స్ సింపుల్ అండ్ స్వాగ్ తో అదుర్స్ అనిపించాయి. అయితే వీటిలో గాజు గ్లాస్ స్టెప్ అందర్నీ ఆకర్షిస్తుంది. గాజు గ్లాస్ అనేది పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో.. పవన్ కోసం మెగా హీరోలంతా కాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. చిరంజీవి, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా మెగా హీరోలంతా పవన్ కి మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
రామ్ చరణ్ కూడా పవన్ కోసం ప్రచారం చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో బన్నీని కూడా జనసేన కాంపెయిన్ లో చూడాలని మెగా ఫ్యాన్స్ అంతా ఆశపడుతున్నారు. అయితే అల్లు అర్జున్.. డైరెక్ట్ ఫీల్డ్ లోకి దిగకుండా సినిమాలు ద్వారానే జనసేనని ప్రమోట్ చేస్తున్నారు. నేడు రిలీజ్ చేసిన సాంగ్ లో గాజు గ్లాస్ తో అల్లు అర్జున్ స్టెప్ వెయ్యడం అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా పవన్ అభిమానులు, జనసైనికులు.. ఈ స్టెప్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు.
దీంతో ఈ గాజు గ్లాస్ స్టెప్ బిట్ ని నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. గాజు గ్లాస్ కే మీ ఓటు అంటూ కామెంట్స్ చేస్తూ.. బన్నీ స్టెప్ ని షేర్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ గతంలో ఒకసారి పవన్ తో కలిసి జనసేన ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మరి ఈసారి కూడా బన్నీ పవన్ కోసం వస్తారా..? లేదా ఇలా సాంగ్ ప్రమోషన్ తోనే సరిపెట్టుకుంటారా..? అనేది చూడాలి.
ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్ర గాజు గ్లాస్ పై వేసి జనసేన అభ్యర్థులని గెలిపించు ప్రార్థన!
– ఇట్లు పుష్పరాజ్ ఫాన్స్!#VoteForGlass 🥛 pic.twitter.com/t1FzYV1HVJ
— Kishan (@kishan_Janasena) May 1, 2024
గాజు గ్లాస్ కే మన ఓటు 🥛
ఈ విషయంలో తగ్గెదే లే 🤫💥#PushpaPushpa @alluarjun pic.twitter.com/iKgbmM6u8i
— Devaraj_janasena_ (@_devaraj_pspk) May 1, 2024