Allu Arjun :‘నాట్స్ 2025’లో టాలీవుడ్ హంగామా.. పుష్ప డైలాగులతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్
Allu Arjun : అమెరికాలో ఘనంగా నిర్వహించిన ‘నాట్స్ 2025’ వేడుకలు తెలుగు ప్రేక్షకులకు అనురంజనం కలిగించాయి. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్, రాఘవేంద్రరావు, సుకుమార్, శ్రీలీల పాల్గొని అక్కడి ప్రవాసాంధ్రులను ఉత్సాహంతో ముంచెత్తారు.
- By Kavya Krishna Published Date - 03:46 PM, Sun - 6 July 25

Allu Arjun : అమెరికాలో ఘనంగా నిర్వహించిన ‘నాట్స్ 2025’ వేడుకలు తెలుగు ప్రేక్షకులకు అనురంజనం కలిగించాయి. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్, రాఘవేంద్రరావు, సుకుమార్, శ్రీలీల పాల్గొని అక్కడి ప్రవాసాంధ్రులను ఉత్సాహంతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన పుష్ప స్టైల్ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. “తెలుగు వారంటే ఫైర్ అనుకుంటారా.. వైల్డ్ ఫైర్”, “నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్” అంటూ చెప్పిన డైలాగులు అక్కడి ప్రేక్షకులను ఆనందపరిచాయి. “ఇంతమంది తెలుగు వాళ్లను చూసినప్పుడు హైదరాబాద్‌లో ఉన్నట్టే అనిపిస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. ఎక్కడున్నా తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే” అంటూ తన స్పెషల్ పంచ్ లైన్‌తో సభను హుషారెత్తించారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – తన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, తానే పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఈ వేదికపై కనిపించడం గర్వంగా ఉందన్నారు. సుకుమార్‌ను ఉద్దేశించి – “‘అడవి రాముడు’తో అడవిని నమ్ముకుని నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను.. నువ్వు ‘పుష్ప’తో అదే చేశారు” అని చమత్కరించారు. దర్శకుడు సుకుమార్ తన ప్రసంగంలో – తన కెరీర్‌కు కీలకంగా నిలిచిన ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని ఆదరించిన అమెరికా తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగు సినిమాకు గొప్ప సేవలు అందించిందని కొనియాడారు. ‘నాట్స్ 2025’ వేడుకల వేళ తెలుగు సినీ తారల సందడి తెలుగు ప్రేక్షకులకు జ్ఞాపకాలుగా నిలిచిపోయింది.
AP HighCorut: ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు