Allu Arjun : గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న అల్లు అర్జున్..!
సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈ లాంగ్ వీకెండ్ భారీ వసూళ్లు వచ్చేవి. ఐతే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లకు పోటీగా వచ్చిన ఆయ్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్
- By Ramesh Published Date - 02:33 PM, Fri - 16 August 24

ఆగష్టు 15న ఏమాత్రం సినిమా బాగున్నా సరే సినిమా సెన్సేషనల్ హిట్ కొడుతుంది. ఐతే ఈసారి ఆగష్టు 15కి వచ్చిన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి కలెక్షన్స్ రాబట్టలేదు. మిస్టర్ బచ్చన్ తో హరీష్ శంకర్, రవితేజ కాంబో రిలీజ్ ముందు భారీ హైప్ వచ్చినా రిలీజ్ రోజే సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఇక పూరీ రామ్ కలిసి మరోసారి చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు అదే డివైడ్ టాక్ వచ్చింది.
రెండు సినిమాలు మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చాయి. కానీ రెండు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈ లాంగ్ వీకెండ్ భారీ వసూళ్లు వచ్చేవి. ఐతే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లకు పోటీగా వచ్చిన ఆయ్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమా చూసిన వారంతా కూడా బాగుందని చెబుతున్నారు.
ఐతే అసలు ఆగష్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సుకుమార్ సినిమాను లేట్ చేయడం వల్ల వాయిదా పడింది. ఓ పక్క బాలీవుడ్ లో స్త్రీ 2 మూవీ రిలీజై బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఆగష్టు 15న అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 వచ్చినట్టైతే తప్పకుండా సినిమా వసూళ్లు అదిరిపోయేవి. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.
డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ డేట్ న అయినా సినిమాను తెస్తారా లేదా అని ఫ్యాన్స్ డాఉట్ పడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో శ్రీవల్లిగా రష్మిక ఈ పార్ట్ లో మరోసారి అదరగొట్టేస్తుందని అంటున్నారు.
Also Read : Kantara Rishab Shetty : జాతీయ ఉత్తమ నటుడు.. కాంతార రిషబ్ శెట్టి..!